https://oktelugu.com/

Love Posters: రాజమండ్రిలో ఆసక్తికరంగా ‘ప్రేమ’ పోస్టర్లు.. ప్రేమికులేనా అంటించింది?

Love Posters: నిండా మునిగినోడికి చలి ఎక్కడది.. ఇప్పుడు ప్రేమ కోసం తపనపడే వారు కూడా ఆ మైకంలో మునిగితేలుతుంటారు. ఇప్పుడు రాజమండ్రిలో తెల్లారి లేచేసరికి అంటించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అసలు ఏంటీ పోస్టర్లు ఎందుకు అంటించారు. ఎందుకు ఇలా సారీ చెబుతున్నారన్నది ఆసక్తి రేపుతోంది. రాజమండ్రి నగరం నిండా వింత పోస్టర్లు తెల్లారేసరికి కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘సారీ.. మోసం చేయలేదు’ అని రాసి ఉన్న పోస్టర్లను సిటీలోని పలు ప్రాంతాల్లో అంటించారు. అలాగే […]

Written By: , Updated On : November 5, 2021 / 02:18 PM IST
Follow us on

Love Posters: నిండా మునిగినోడికి చలి ఎక్కడది.. ఇప్పుడు ప్రేమ కోసం తపనపడే వారు కూడా ఆ మైకంలో మునిగితేలుతుంటారు. ఇప్పుడు రాజమండ్రిలో తెల్లారి లేచేసరికి అంటించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అసలు ఏంటీ పోస్టర్లు ఎందుకు అంటించారు. ఎందుకు ఇలా సారీ చెబుతున్నారన్నది ఆసక్తి రేపుతోంది.

RaJamandry-Posters

RaJamandry-Posters

రాజమండ్రి నగరం నిండా వింత పోస్టర్లు తెల్లారేసరికి కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘సారీ.. మోసం చేయలేదు’ అని రాసి ఉన్న పోస్టర్లను సిటీలోని పలు ప్రాంతాల్లో అంటించారు. అలాగే అందులో బాధపడుతున్న ఓ ఎమోజీని కూడా ముద్రించారు.

అయితే రాత్రికి రాత్రే ఈ పోస్టర్లు వెలియడంతో ఎవరు అంటించారో తెలియక అందరూ తికమకపడ్డారు. ఏం జరిగిందో ఎవరు సారీ చెప్పారు? ఎందుకు చెప్పారన్నది ఆరాతీయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే ఒక విషయం వైరల్ అయ్యింది.

ఎవరో ప్రియుడు తన ప్రేయసికి సంజాయిషీ ఇవ్వడానికి ఇలా బహిరంగంగా సిటీ మొత్తం పోస్టర్లు ‘సారీ .. మోసం చేయలేదు’ అని అంటించాడని టాక్ వినిపిస్తోంది. ఇది ఒక ప్రియుడే అంటించాడని కొందరు అంటుంటే.. ప్రియురాలే బుజ్జగించేందుకు ఈ పనిచేసిందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో ఈ పోస్టర్ల కథ ఇప్పుడు రాజమండ్రిలో ఆసక్తి రేపుతోంది.