New Parliament Building Inauguration
New Parliament Building Inauguration: అమృతోత్సవ వేళ.. ఆత్మ నిర్భరతకు ప్రతీకగా సరికొత్త పార్లమెంటు భవనం ఆరంభానికి సిద్ధమైంది. సనాతన కళాకృతులతో, ఆధునిక హంగులతో, దూరదృష్టితో, భారతీయ నిర్మాణ కౌశలంతో నిర్మించిన ఈ ప్రజాస్వామ్య దేవాలయం ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం కాబోతోంది. ప్రస్తుత వృత్తాకార పాత భవనం పక్కనే స్వదేశీ ఆలోచనలతో త్రికోణాకారంలో సుమారు రూ. 1200 కోట్లకుపైగా వ్యయంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకుంది. రాజ్సార్ ఆధునికీకరణ, ప్రధాన మంత్రికి కొత్త నివాసం, కొత్త కార్యాలయం, ఉపరాష్ట్రపతి కొత్త కార్యాలయం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
ఆంగ్లేయులు నిర్మించిన ప్రస్తుత భవనం..
ప్రస్తుత పార్లమెంటు భవనానికి 1921లో శంకుస్థాపన చేశారు. ఆంగ్లేయుల ఆలోచనలకు, అప్పటి అవసరాలకు అనుగుణంగా ఆరేళ్లలో(187) అది సిద్ధమైంది. బ్రిటిష్ హయాంలో కౌన్సిల్ హౌస్‌గా పిలిచేవారు. ఇందులోనే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొలువుదీరేది. 1956లో ప్రస్తుత భవనానికి రెండు అంతస్థులు అదనంగా కలిపారు. కాలానుగుణంగా అప్పటికి ఇప్పటికీ అవసరాలు పెరిగాయి. స్థలపరంగానూ ఇరుకుగా మారింది సమావే శాలకే ఇబ్బందిగా ఉంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి సెంట్రల్ హాల్ ఉన్నా అందులో కూర్చోవచ్చు. సంయుక్త సమావేశం నిర్వహించినప్పుడల్లా దాదాపు 200 చర్చీలను తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చేది. అంతేగాకుండా వందేళ్లకు చేరుకుంటున్న ఈ భవంతిలో కొత్తగా ఎలక్ట్రిక్ కేబుళ్లు, సీసీ టీవీలు, ఆడియో వీడియో తదితరాల కోసం ఎప్పటికప్పుడు ఆవనంగా ఏర్పాట్లు చేయడంతో భవనం పటిష్టత దెబ్బతింది. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. అప్పుడు సీట్లు పెరుగుతాయి. అందుకు ప్రస్తుత పార్లమెంటు భవనం సరిపోదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది.
కొత్త భవనంలో సకల సౌకర్యాలు..
కొత్త పార్లమెంట్ భవనాన్ని అహ్మదాబాద్ కు చెందిన హెచ్‌సీపీ డిజైనర్ బిమల్ పటేల్ పశిల్పిడి ట్వెన్, హెర్బర్డ్ బేకర్ డిజైన్ చేశారు. ఇందులో ఆధునిక హంగులు కల్పించారు. సభ్యుల ఓటింగ్ కు వీలుగా సీట్లలో బయోమెట్రిక్, డిజిటల్ అనువాద పరికరాలు, మార్పుకో గల మైక్రోఫోన్లు తదితరాలను అమర్చారు. ప్రతీ సభ్యుడి సీటువడ్డా మల్టీమీడియా డిస్‌ప్లే సదుపాయం ఉంటుంది. సామాన్యులు గ్యాలరీల్లో ఎక్కడ కూర్చుని చూసినా స్పష్టంగా కనిపించేలా సీట్లను ఏర్పాటు చేశారు. మీడియాకూ ప్రత్యేక ఆధునిక ఏర్పాట్లు చేశారు. మొత్తం 180 సీట్లను మీడియాకు కేటాయించారు.
సంస్కృతిని ప్రతిభింభించేలా..
త్రిభుజాకారంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి. కర్మలుగా నామకరణం చేసినట్లు తెలిసింది. ఈ మూడు ద్వారాల పక్కన వేల సంవత్సరాల భారతీయ చరిత్రను తెలిపే కాంస్య చిత్రాలను ఏర్పాటు చేశారు. జ్ఞాన దానికి ఒకవైపున గార్గి యాజ్ఞవల్కవ మధ్య జరిగిన సంవాద దృశ్యం, మరోవైపున నలంద చిత్రాలను నెలకొల్పుతున్నారు. శక్తి ద్వారానికి ఒకవైపున చాణక్య మరోవైపున మహాత్మా గాంధీ దండి యాత్ర దృశ్యాలను ఏర్పాటు చేస్తున్నారు. కర్మ ద్వారానికి ఒక వైపు కోణార్క్ చక్రం, మరోవైపున సర్దార్ వల్లబ్బాయ్ పటేల్, బాబాసాహెబ్ అంటే షర్ కాంస్య విగ్రహాలను నెలకొల్పుతున్నారు. ఇంకోవైపు పార్లమెంటు భవనం. లోపల ఇండియన్ గ్యాలరీ ఏర్పాటు చేస్తూ ఇందులో అన్ని రాష్ట్రాలకు చెందిన వెయిటింగ్ శిల్పకళలను ఉంచుతున్నారు.