https://oktelugu.com/

Inter board: ఇంటర్ బోర్డు నిర్వాకం.. విద్యార్థులకు శాపం.. తగ్గిన ఉత్తీర్ణత శాతం

Inter board: ఇంటర్ బోర్డు నిర్వాకం ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలవడం దానికి రివాజే. ఇందులో భాగంగానే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు వద్దని ఎంత మంది చెప్పినా వినకుండా నిర్వహించి విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడుకుంటోంది. ఉత్తీర్ణతా శాతం తగ్గడంతో అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఎవరు సమాధానం చెబుతారు. సంబంధిత శాఖ మంత్రా? ప్రజాప్రతినిధులా? ప్రభుత్వమా? ఎవరు విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపుతారు? బాగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 18, 2021 / 04:03 PM IST
    Follow us on

    Inter board: ఇంటర్ బోర్డు నిర్వాకం ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలవడం దానికి రివాజే. ఇందులో భాగంగానే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు వద్దని ఎంత మంది చెప్పినా వినకుండా నిర్వహించి విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడుకుంటోంది. ఉత్తీర్ణతా శాతం తగ్గడంతో అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఎవరు సమాధానం చెబుతారు. సంబంధిత శాఖ మంత్రా? ప్రజాప్రతినిధులా? ప్రభుత్వమా? ఎవరు విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపుతారు? బాగా చదివే విద్యార్థులు కూడా ఫెయిల్ కావడం విచిత్రమే.

    Inter Board

    కరోనా ప్రభావంతో రాష్ర్టవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల నిర్వహణ సరిగా లేకుండా పోయింది. దీంతో అందరు ఆన్ లైన్ తరగతులతోనే కాలం వెళ్లదీశారు. ఏదో ఒకటి రెండు నెలలు తరగతులు నిర్వహించడంతో పరీక్షలు నిర్వహించడానికి ఉత్సాహం చూపడం ఇంటర్ బోర్డు అత్యుత్సాహమే అనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ లో మార్కులు తక్కువగా రావడంతో విద్యార్థుల ఆందోళన రెట్టింపయింది.

    ప్రస్తుతం పరీక్షలు నిర్వహించి ఏం సాధించారు? మార్కులు తక్కువగా వచ్చి ఫెయిలయినందుకు విద్యార్థులు ఓ పక్క వెక్కివెక్కి ఏడుస్తుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకునే హక్కు ప్రభుత్వానికి లేదని విద్యార్థి సంఘాలు సైతం రోడ్డెక్కాయి. ఈనేపథ్యంలో విద్యార్థులను నట్టేట ముంచే కార్యక్రమంలో భాగంగానే పరీక్షల నిర్వహణకు పూనుకుందనే వాదనలు సైతం బలంగా వస్తున్నాయి.

    Also Read: Congress Leaders: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమేనా?

    ఇంతకీ ఫెయిలయింది విద్యార్థులా? ప్రభుత్వమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఉత్తీర్ణతా శాతం పడిపోవడంతో విద్యార్థుల్లో కంగారు మొదలైంది. ఇంత దారుణం జరగడానికి కారణం ఇంటర్ బోర్డే అని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం కూడా ఏం మాట్లాడకుండా దాటవేత ధోరణి ప్రదర్శించడం గమనార్హం.

    Also Read: Telangana: తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు?

    Tags