
గతంలో అమెరికా, ఆస్రేలియా, జపాన్, ఇండియా భాగస్వామ్యంతో క్వాడ్ కూటమి ఏర్పాటు చేశారు. కానీ కాలక్రమంలో దాని ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారనుందని తెలుస్తోంది. ఈ నేథ్యంలో అమెరికా పంథా మారుతోంది. భారత్ విషయంలో ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతోందని తెలుస్తోంది. ఇన్నాళ్లు ఇండియాకు ప్రాధాన్యం ఇచ్చిన అగ్రరాజ్యం ప్రస్తుత నేపథ్యంలో దూరం పెట్టడంలో ఓ ప్రధాన కారణం ఉందని సమాచారం.
అయితే భారత్ రష్యాతో ఏర్పరచుకున్న మైత్రీ బంధమే అమెరికా ఆగ్రహానిక కారణమని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ కావడంతో జో బైడెన్ ఇండియాపై ఆంక్షలు విధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనపిస్తోంది. పుతిన్-మోడీ భేటీతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యే సూచనలు కనిపించడంతోనే బైడెన్ ఇండియాను ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అమెరికా అఫ్ఘనిస్తాన్ పై చేసే యుద్ధంలో కూడా ఇండియా భాగస్వామ్యం కావాలని కోరినా దానికి ఒప్పుకోలేదు. దీంతో అమెరికా ఇండియాపై కోపం పెరిగింది. ఇవన్నీ కారణాలతో ఇండియాను అమెరికా ప్రస్తుతం పక్కన పెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచ దేశాల సమూహంలో మన దేశాన్ని ఏకాకి చేయాలని అమెరికా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఎక్కడి కి దారి తీస్తాయో అని అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
Also Read: Apple Chaina: పెనుదుమారం: అమెరికాకు తెలియకుండా చైనాలో ‘యాపిల్’ 20లక్షల కోట్ల రహస్య డీల్?
ఆది నుంచి రష్యా మన దేశంతో సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తోంది. మనకు ఏ విషయంలో అయినా రష్యా మైత్రి బంధాన్ని కలిగి ఉంది. దీంతో మనకు ఏ ఆయుధాలు కావాలన్నా అక్కడి నుంచే తెచ్చుకుంటున్నాం. దీంతో రష్యా ఇండియా మధ్య ఉన్న బంధంపై అమెరికా కన్నెర్ర చేస్తోంది. ఫలితంగా మనకు ఇప్పుడు కష్టాలే రానున్నాయి. అగ్రరాజ్యం కావడంతో ఇప్పుడు ఇండియా మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందా అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: PM Modi: బిపిన్ రావత్.. అందుకే ప్రధాని మోడీకి ఇష్టమట..