Homeజాతీయ వార్తలుIndia Nuke policy: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు షాక్‌!

India Nuke policy: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు షాక్‌!

India Nuke policy: న్యూక్లియర్‌ ఎనర్జీ.. వినియోగించే తీరుపై దీని పవర్‌ ఆధారపడి ఉంటుంది. విధ్వంసానికి వాడితే ప్రపంచం నాశనం అవుతుంది. సద్వినియోగం చేసుకుంటే అనేక దేశాలు అభివృద్ధి చెందుతాయి. యురేనియంతో ఉత్పత్తి చేసే పవర్‌తో విద్యుత్‌ ధరలు చాలా వరకు తగ్గుతాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇటీవల ప్రైవేటు సంస్థలుకు న్యూక్లియర్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో భాగస్వామ్యం అందించే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 8–10 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న భారత్‌ రాబోయే కాలంలో 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది విద్యుత్‌ బిల్లులు 5,000 నుంచి 500 రూపాయల వరకు తగ్గే అవకాశాన్ని కలిగిస్తుంది.

న్యూక్లియర్‌ ఉత్పత్తిలో భారత స్థానం
ప్రపంచంలో న్యూక్లియర్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో చైనా మొదటి, అమెరికా రెండో స్థానంలో ఉండగా, భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. యురేనియం సమృద్ధితో, భారత్‌ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఈ శక్తిని మరింత విశాలపరిచే అవకాశాలు ఉన్నాయి. అమెరికా, కెనడా వంటి దేశాల సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెడితే స్థాయి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

భూభౌతిక, ఆర్థిక ప్రభావాలు
ప్రైవేటీకరణతో న్యూక్లియర్‌ ఉత్పత్తి పెరిగితే విద్యుత్‌ తీవ్రంగా సరఫరా అవ్వడం వల్ల పాకిస్తాన్‌ కు భయాందోళనలు ఏర్పడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇంతకుముందు న్యూక్లియర్‌ భూగర్భ సాంకేతికతపై భారత్‌ పెరిగిన అసలు శక్తిని చూసి చైనా కూడా ఈ వ్యూహంతో ఇబ్బంది పడుతుందని అంచనా. ఈ కొత్త ప్రణాళిక భారత్‌కు భద్రత, ఆర్థిక వృద్ధికి విప్లవాత్మక మార్గదర్శకంగా నిలుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular