Balakrishna Satirical Comments: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం వచ్చే నెల 5 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో బాలయ్య మరియు బోయపాటి శ్రీను మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి. చూస్తుంటే కూటమి మధ్య చిచ్చు పెట్టెలాగా ఉన్నాయి. ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్ కాకపోయినప్పటికీ, ప్రతిపక్షం వైసీపీ పార్టీ కి పెద్ద ఆయుధమే ఇచ్చేసాడు బాలయ్య. ఆయన మాట్లాడుతూ ‘ఒకపక్క సినిమా ఆర్టిస్ట్ గా, ఒక పక్క హిందూ పురం ఎమ్మెల్యే గా, ఒక పక్క బసవ తారకం కాన్సర్ హాస్పిటల్ ఛైర్మెన్ గా, ఇలా అన్ని చెయ్యగలుగుతున్నాను అంటే, నేను ఒక్క దానినే అంటిపెట్టుకొని ఉండలేను’
‘కానీ నా భార్య ఎప్పుడూ నాతో అంటూ ఉంటుంది, నన్నే అంటిపెట్టుకొని ఉన్నారని, కానీ నాకు ఒక్కరే భార్య’ అంటూ కామెంట్స్ చేసాడు. ఇది కేవలం బాలయ్య తనకు సినిమాలు, ఎమ్మెల్యే పదవి మరియు హాస్పిటల్ బాధ్యతలు, అన్ని భార్య తో సమానమే అని, కానీ దీనిని సోషల్ మీడియా లో కొంతమంది ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసినవాని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ని చూసిన వాళ్ళు ఎలాంటి అపార్థం చేసుకోలేదు కానీ, వీడియో ని చూడని వాళ్ళు మాత్రం బాలయ్య పై సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం నిన్న దీని గురించే చర్చ నడిచింది. ఇప్పటికే బాలయ్య అసెంబ్లీ లో చిరంజీవి పై సెటైర్లు విసిరి గ్రౌండ్ లెవెల్ లో జనసేన పార్టీ కార్యకర్తల మనసులు నొచ్చుకునేలా చేసాడు. పవన్ కళ్యాణ్ కూడా చూసి చూడనట్టు ఈ అంశాన్ని వదిలేసాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను కూడా ఆయన అలాగే తేలికగా తీసుకుంటారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక అఖండ 2 విషయానికి వస్తే ఈ చిత్రానికి స్టార్ హీరోల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంతే కాకుండా మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా ఒక రోజు ముందే ప్రీమియర్ షోస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే అధికారికంగా రాబోతుంది. కానీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా వీక్ గా ఉన్నాయి. ఇలాంటి జానర్ సినిమాలకు ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో వీక్ అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించిందే, కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం దుమ్ము లేపేస్తుందని అంటున్నారు.
ఒక్కరే భార్య అంటూ బాలకృష్ణ కామెంట్స్
ఒక్కదాన్నైతే హత్తుకొని ఉండలేను-బాలకృష్ణ
ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు..?
అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
ఒకవైపు నటుడిగా,ఎమ్మెల్యేగా..ఇంకోవైపు
బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ గా అన్నీ చేయగలుగుతున్నా..కానీ .. నా… pic.twitter.com/N2BJu01w4n
— BIG TV Breaking News (@bigtvtelugu) November 29, 2025