Lok Sabha Election Results 2024: పదేళ్ల నుంచి బిజెపి అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధించాలని భావించింది. మరో వైపు కాంగ్రెస్ ఇండియా కూటమిగా ఏర్పడి.. కచ్చితంగా బిజెపిని ఓడించి, అధికారాన్ని దక్కించుకోవాలని అంచనా వేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపించాయి. అయితే వాస్తవ ఫలితాలలో ఆ విషయం ప్రతిబింబించడం లేదు. వార్ వన్ సైడ్ అన్నట్టుగా లేదు.. అలాగని కాంగ్రెస్ కు అధికారం దక్కే పరిస్థితి లేదు. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం చూసుకుంటే.
కర్ణాటక రాష్ట్రంలో ఎన్డీఏ 17 స్థానాలలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 11 స్థానాలలో పై చేయి సాధించింది.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ కూడా ముందంజలో ఉన్నాడు.
రాజస్థాన్లో 25 పార్లమెంటు స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో ఇక్కడ అన్ని స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. అయితే ఈసారి ఇక్కడ ఎన్డీఏ 13, కాంగ్రెస్ 11 స్థానాలలో లీడ్ లో కొనసాగుతున్నాయి..
ఢిల్లీలో మొత్తం ఏడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ప్రకారం ఆరు స్థానాలలో బిజెపి ముందంజలో ఉంది. ఇండియా కూటమి ఒకే ఒక్క స్థానంలో లీడ్ లో కొనసాగుతోంది.
దేశంలోనే అత్యధిక పార్లమెంటు స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ లో.. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. 80 పార్లమెంటు స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో.. గత ఎన్నికల్లో బిజెపి 69 స్థానాలు దక్కించుకుంది. కానీ ఈసారి 38 స్థానాలలో బిజెపి, 41 స్థానాలలో ఇండియా కూటమి, ఒకేఒక్క స్థానంలో ఇతరులు లీడ్ లో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి, ఎన్డీఏ మధ్య పోరు రసవత్తరంగా ఉంది.. 42 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్డీఏ 16, ఇండియా కూటమి 26 స్థానాలలో ఆధిక్యం లో కొనసాగుతున్నాయి. బిజెపి ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ.. మమతా బెనర్జీ పై చేయి సాధించారు.
ఇక ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి 277 స్థానాలలో లీడ్ లో ఉంది. 13 స్థానాలలో సాధించింది. కాంగ్రెస్ 189 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఏడుగురు అభ్యర్థులు ఎంపీలుగా విజయం సాధించారు. ఇతరులు 56 స్థానాలలో లీడింగ్ లో ఉన్నారు.