https://oktelugu.com/

India -Pakistan war in 1971: భారత్ -పాక్ యుద్ధం..: 1971 డిసెంబర్ నెలలో ఏం జరిగింది..?

India -Pakistan war in 1971: భారత్, పాకిస్తాన్ మధ్య అగ్గేస్తే అటోమేటిక్ గా రాజుకుంటుంది. మనదేశం నుంచి విడిపోయినా పాకిస్తాన్ తో ఎప్పుడూ యుద్ధవాతావరణమే ఉంటుంది. ప్రభుత్వాలు మారినా.. పాలకులు కొత్తవారు వచ్చినా ఇండియా వర్సెస్ పాక్ అన్నట్లుగానే సాగుతూ ఉంటుంది. అయితే 1971లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తానీయుల మధ్య జరిగిన యుద్ధంలో భారత్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తూర్పు పాకిస్తానీయులకు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2021 / 08:26 AM IST
    Follow us on

    India -Pakistan war in 1971: భారత్, పాకిస్తాన్ మధ్య అగ్గేస్తే అటోమేటిక్ గా రాజుకుంటుంది. మనదేశం నుంచి విడిపోయినా పాకిస్తాన్ తో ఎప్పుడూ యుద్ధవాతావరణమే ఉంటుంది. ప్రభుత్వాలు మారినా.. పాలకులు కొత్తవారు వచ్చినా ఇండియా వర్సెస్ పాక్ అన్నట్లుగానే సాగుతూ ఉంటుంది. అయితే 1971లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తానీయుల మధ్య జరిగిన యుద్ధంలో భారత్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తూర్పు పాకిస్తానీయులకు భారత్ అండగా నిలవడంతో పశ్చిమ పాకిస్తాన్ భారత్ పై యుద్ధానికి దిగింది. అయితే ఆ సమయంలో పాకిస్తాన్ కు అమెరికా అండగా నిలిచి ఆయుధాలను పంపగా.. సోవియట్ మాత్రం భారత్ పక్షాన నిలిచింది.

    Also Read: రోహిత్.. కోహ్లి.. ఎవరిది బెస్ట్ కెప్టెన్సీ..? భారత కెప్టెన్ గా ఎవరు బెటర్..? సోషల్ మీడియాలో రచ్చ

    పాకిస్తాన్తో భారత్ యుద్ధం నేపథ్యంలో ఇండియాకు రష్యా నౌకా సాయం చేసింది. ఈ నౌకల కోసం భారత్ నుంచి కెప్టెన్ కేకే నయర్ నేతృత్వంలో ఓ బృందం అక్కడికి వెళ్లింది. నౌకా నిర్వహణపై శిక్షణ తీసుకోవడంతో పాటు రష్యాభాష పై పట్టు సాధించింది. అయితే కెప్టెన్ నయ్యర్ తన పుస్తకంలో 1971 నాటి పరిస్థితులను ఇలా వివరించారు. ‘పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో ఇండియాకు వచ్చిన నౌకలు ప్రత్యేకమైనవి. ఇవి వేగంగా కదలవు. అంతేకాకుండా 500 నాటికల్ మైళ్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేవు. ’ అని ఆయన తెలిపారు.

    ‘సోవియన్ యూనియన్ నుంచి వచ్చిన క్షిపణుల్లో ఒక్కో నౌక బరువు 180 టన్నులు ఉంటుంది. ముంబయ్ లో సదుపాయాలు లేనందున వాటిని నేరుగా కోల్ కతాకు పంపించి అక్కడ దించారు. అయితే ఈ నౌకలు ముంబయ్ కి వెళ్లాల్సి ఉంది. మొదట ఆందోళన చెందినా.. ఆ తరువాత భారీ క్రేన్లను ఉపయోగించి మొత్తానికి వాటిని ముంబయ్ కి చేర్చారు. పాక్ తో యుద్ధం జరిగితే వీటిని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 1971 డిసెంబర్ 4న రాత్రి నిపాత్, నిర్ఘట్, వీర్ అనే నౌలు కరాచీ వైపు వెళ్లాయి. అయితే అప్పటికే పాక్ ‘పీఎన్ఎస్ ఖైబర్’ అనే నౌకతో గస్తీ చేపడుతోంది. రాత్రి 10 గంటలకు భారత్ నౌకలు కరాచీ వైపు వస్తున్నట్లు పాకిస్తాన్ కు చెందిన ఖైబర్ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన భారత్ 10.40 గంటలకు నిర్ఘట్ నుంచి తొలి క్షిపణి వదిలింది’ అని తెలిపారు.

    ‘అయితే అటు నుంచి ఖైబర్ కూడా గన్ లను ఉపయోగించడం మొదలు పెట్టింది. కానీ మా నుంచి వెళ్లిన క్షిపణులనుంచి తట్టుకోలేకపోయింది. తీవ్రమైన దాడితో ఖైబర్ ధ్వంసమైంది. ఇక రాత్రి 11 గంటలకు భారత్ కు చెందిన మరో నౌక ‘నిపాత్’ రాడర్ పాకిస్తాన్ కు చెందిన మరో నౌకను గుర్తించింది. దీంతో వెంటనే క్షిపణి పంపించారు. ఆ తరువాత అక్కడి నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చినట్లు అర్థమైంది. దీంతో అక్కడి నౌక రెండు ముక్కలైనట్లు రాడార్లో కనిపించింది. ’అని టాస్క్ గ్రూప్ కమాండర్ కేపీ గోపాల్ రావు అందులో పేర్కొన్నారు.

    Also Read: ఎన్టీఆర్ షోకు మహేష్.. వీళ్ల అల్లరి చూస్తే రెండు కళ్లు చాలవు!