https://oktelugu.com/

భారత్ ఊపిరి పీల్చుకో. కరోనా లేటెస్ట్ అప్ డేట్

దేశంలో కరోనా క్రమంగా తగ్గుతోంది. గత24 గంటల్లో భారతదేశంలో 60,471 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు 2726 కరోనా మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,95,70,881 కు పెరిగింది. ఇప్పటి వరకు ఇందులో మహమ్మారి కారణంగా 3,77,031 మంది మరణించారు. దేశంలో ఒక రోజులో లక్ష కన్నా తక్కువ కేసులు నమోదు కావడం ఇది వరుసగా ఎనిమిదో రోజు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 15, 2021 / 02:13 PM IST
    Follow us on

    దేశంలో కరోనా క్రమంగా తగ్గుతోంది. గత24 గంటల్లో భారతదేశంలో 60,471 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు 2726 కరోనా మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,95,70,881 కు పెరిగింది. ఇప్పటి వరకు ఇందులో మహమ్మారి కారణంగా 3,77,031 మంది మరణించారు.

    దేశంలో ఒక రోజులో లక్ష కన్నా తక్కువ కేసులు నమోదు కావడం ఇది వరుసగా ఎనిమిదో రోజు. జూన్ 8న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 86,498 కొత్త కేసులను నివేదించింది. అంటే ఏప్రిల్ ఆరంభం నుంచి 66 రోజుల తరువాత మొదటిసారిగా జూన్ 8న లక్ష కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి వరుసగా లక్ష కన్న తక్కువ కేసులు నమోదవుతున్నాయి.

    ఇది కాస్త ఊరట కలిగించే అంశం. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ సోమవారం 1,751,358 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా అంతకుముందు 24 గంటల వ్యవధిలో14,92,152 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఐసీఎంఆర్ తాజా డేటా ప్రకారం మొత్తం38,13,75,984 నమూనాలను ఇప్పటివరకు పరీక్షించినట్లు వెల్లడించింది.

    గత కొన్ని రోజులుగా రోజువారి కేసుల సంఖ్య తగ్గినందున వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన లాక్ డౌన్ తో పాటు ఇతర పరిమితుల్లో రాష్ర్ట ప్రభుత్వాలు సడలింపులు ప్రకటించాయి. ఉదాహరణకు జూన్ 14న ఢిల్లీ విధించిన లాక్ డౌన్ నుంచి మూడో దశ అన్ లాక్ ప్రారంభించింది ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు కూడా కేవలం రాత్రి కర్ఫ్యూ కే పరిమితం చేశాయి.