G20 Summit- India: ఈసారి ఇండోనేషియా నుంచి భారతదేశానికి జీ20 అధ్యక్ష బాధ్యత వచ్చింది. దీని ద్వారా భారత్… కాశ్మీర్ విషయంలో చైనా, పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు ఎండగట్టాలని ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగా జీ20 సమావేశాన్ని కాశ్మీర్లో నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నది. ఇదే జరిగితే చైనా పప్పులు ఉడకవ్. పాకిస్తాన్ కల్లబొల్లి మాటలకు సానుభూతి పవనాలు ఉండవు. అందుకే కదా ఏదో ఒకటి కాయించి పిస పిస చేయాలి. చైనా కూడా అదే చేసింది.

దుర్మార్గపు దేశం
పొరుగున ఉన్న హాంకాంగ్ ను చెరబట్టింది. టిబెట్ ను సర్వనాశనం చేసింది. శ్రీలంకను అప్పుల మయం చేసింది. పాకిస్తాన్ ను కోలుకోకుండా చేసింది. ఇంకా ఎన్ని దేశాలను ముంచుతుందో? చైనా జాతీయ జంతువు డ్రాగన్. అది పరాన్నజీవి. దాని లక్షణాలు పుణికి పుచ్చుకుందేమో.. చైనా కూడా అంతే.. ఇతర దేశాల మీద పడి తినడమే దానికి తెలుసు. దేశంలో ఒకవైపు కోవిడ్ తీవ్రస్థాయిలో ప్రబడుతుంటే దాని నివారణకు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇతర దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు దారి తీయడమేమిటో ఆ దేశానికి తెలియాలి. వాస్తవానికి పాంగాంగ్ ప్రాంతం లో బలగాలను ఉపసంహరించుకుందామని చెబుతూనే తన దారిలో తాను ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నది. మొదటినుంచి భారత్ అనుమానిస్తున్నట్టుగానే పాంగాంగ్ లో చైనా రహస్యంగా కొన్ని నిర్మాణాలలో చేపడుతోంది. తాజాగా పాంగాంగ్ “త్సో” సరస్సు ఉత్తర తీరం ఇది లడాఖ్ తూర్పు ప్రాంతంలో ఉంటుంది . ఇక్కడ చైనా కొత్తగా డివిజన్ స్థాయి హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తోంది.. బలగాలను మోహరించేందుకు, ఆయుధాలను దాచేందుకు సరస్సు వెంబడి గగన తీర పరిరక్షణకు వీటిని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి, 2021 ఫిబ్రవరిలో భారత్, చైనాలో సంయుక్త ఒప్పందానికి వచ్చాయి. “త్సో ” సరస్సు వెంట ఇరుదేశాల బలగాలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాయి. ఎక్కడి నుంచి అయితే బలగాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారో.. అదే పాయింట్ వద్ద ఇప్పుడు చైనా డివిజన్ స్థాయి హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తున్నట్టు అమెరికాలోని వాషింగ్టన్ డిసికి చెందిన సెంటర్ ఫర్ స్టార్ట జిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ చెబుతోంది. శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉత్తర తీరం వెంట గత నెలలో ప్రారంభించిన నిర్మాణాలు, మౌలిక వసతుల విస్తరణ వంటివి స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.. 40 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో ఇంటిని తలపించే నిర్మాణం ఉందని, అదేవిధంగా దక్షిణ భాగంలో ఆయుధ నిల్వ కేంద్రాలు, పశ్చిమ భాగాన కందకాలు కూడా ఉన్నట్టు ఆ సంస్థ తెలిపింది.

దురుద్దేశం లేకుండా ఎలా సాధ్యం
చైనాకు మొదటి నుంచి కూడా భారత్ అంటే అక్కసు. ఆసియా ప్రాంతంలో తనతోపాటు సమాంతరంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న భారతదేశం పట్ల చైనా చేయని కుట్రలు అంటూ లేవు.. వాస్తవాధీన రేఖల వద్ద తరచూ కవింపు చర్యలకు పాల్పడటం చైనాకు పరిపాటి అయింది. గాల్వాన్ లోయలో ఉద్రిక్తతలు కూడా ఇందులో భాగమే. ప్రస్తుతం భారత్ జీ_20 అధ్యక్ష బాధ్యతలు రావటం, కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా లేవనెత్తేందుకు మోదీ సమాయత్తమవుతుండడంతో చైనా ఈ కుట్రలకు పాల్పడింది. అయితే పాంగాంగ్ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వాయు సైన గగనతలం నుంచి ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. సైనికులు కూడా ఆ సరిహద్దు చుట్టూ భారీగా మోహరించారు. మరోవైపు ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ఉన్నంతవరకు భారత దేశంలో సెంటీమీటర్ భూ భాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.