India Corona Upadate: అనుకున్నట్టే అవుతోంది. భారతదేశం క్రమంగా థర్డ్ వేవ్ లోకి జారిపోతోంది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మొన్న రోజుకు 3 లక్షలు దాటిన కొత్త కేసులు తాజాగా 347254కు పెరిగాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 19 లక్షల కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దేశంలో పాజిటివిటీ రేటు ఏకంగా 17.94 శాతానికి ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో ఈ చలికాలంలో కేసుల తీవ్రత పెరిగింది. పైగా సంక్రాంతి పండుగలు తోడు కావడంతో మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. దేశం మెల్లిగా థర్డ్ వేవ్ దిశగా సాగుతోంది. మొన్నటివరకూ 2.5 నుంచి 3 లక్షలకు పైగా నమోదైన కేసులు తాజాగా మూడున్నర లక్షలకు చేరువయ్యాయి.
Also Read: ట్రెండింగ్ న్యూస్.. ఏడాదిలో 3 వేల కోట్ల అప్పు తీర్చిన మహిళ..!
దేశంలో కరోనాకు హాట్ స్పాటులుగా మారాయి ఈ మూడు రాష్ట్రాలు.. కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లోనే ఏకంగా 1.40 లక్షల కేసులు నమోదుకావడం గమనార్హం.
ఇక కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వల్ల కేసులు పెరుగుతున్నాయి. ఆ వేరియంట్ కేసులు 9692కి చేరాయి. కొద్దివారాలుగా వైరస్ విజృంభిస్తుండడంతో క్రియాశీల కేసులు 20 లక్షలు దాటాయి. క్రియాశీల రేటు 5.23 శాతానికి పెరిగిపోయింది. దీంతో క్రమంగా దేశం థర్డ్ వేవ్ లోకి వెళ్లిపోయే ప్రమాదంలో పడింది.
ఇక మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. నిన్న 703 మరణాలు నమోదయ్యాయి. కేరళలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.
భారత్ లో ఈ రెండేళ్ల వ్యవధిలో 3.85 కోట్ల మందికి కరోనా సోకగా.. 488396 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. మొత్తం రికబరీ 3.6 కోట్లుగా ఉంది.
ప్రస్తుతానికి దేశంలో 160 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది. 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి 3.9 కోట్ల డోసులు పంపిణీ చేశారు.
Also Read: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడాది పాలన ఎలా సాగిందంటే?