BrahMos Missile: ఒకప్పుడు ప్రపంచ దేశాలకు అమెరికా, యూరప్ కంట్రీస్ ఆయుధాలను.. ఇతర యుద్ధ సామాగ్రిని విక్రయించేవి. అత్యాధునికమైన ఆయుధాలను అవి తయారు చేసేవి.. ఫలితంగా భారీగా అవి ఆర్జించేవి.. యుద్ధాలను అవే పుట్టించి.. అవే నిలుపుదల చేసేవి. యుద్ధ అవసరాలను పుట్టించడం ద్వారా అవి భారీగా సంపాదించేవి.
కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా.. ఆ దేశాలకు కూడా ఎదురుదెబ్బ మొదలైంది. ఊహించని విధంగా ప్రపంచంలో పరిణామాలు మారిపోవడం మొదలైంది. ఫలితంగా యుద్ధాలు రావడం.. ఇతర దేశాలు కూడా యుద్ధ సామాగ్రిని రూపొందించుకోవడంతో డిఫెన్స్ వ్యాపారం మీద అమెరికా పెత్తనం తగ్గిపోయింది. యూరప్ దేశాల ఏకపక్ష ధోరణి కూడా తగ్గిపోయింది. దీంతో డిఫెన్స్ పరికరాల విషయంలో భారత్ వంటి దేశాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ పనితీరు సాగించే విధంగా రూపొందించడం మొదలుపెట్టాయి. వాటి పనితీరు కూడా అద్భుతంగా ఉండడంతో ఆర్డర్లు పెరిగాయి. దీంతో భారత్ లాంటి దేశం డిఫెన్స్ పరికరాల మీద భారీగా సంపాదించడం మొదలుపెట్టింది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత మనదేశం రూపొందించిన బ్రహ్మోస్ మిస్సైల్స్ శక్తి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు తెలిసి వచ్చింది. వీటిని కొనుగోలు చేయడానికి అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. ఫలితంగా పోటీ విపరీతంగా పెరుగుతుంది. తాజాగా వియత్నం ఈ మిస్సైల్స్ డీల్ మీద సంతకం చేసింది. ఇండోనేషియాతో ఒప్పందం చివరి దశకు వచ్చింది ఇండియాతో బ్రహ్మోస్ డీల్ కుదుర్చుకున్న తొలి దేశంగా ఫిలిప్పీన్స్ రికార్డ్ సృష్టించింది. 2022లో ఏకంగా 375 మిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా 17 దేశాలు ఈ మిస్సైల్స్ కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వివిధ ఒప్పందాల దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తయితే అమెరికా.. పాకిస్తాన్ కుళ్ళుకొని చావడం ఖాయమని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు.
భారత ఆయుధ మార్కెట్ పెరగడంతో అమెరికా రకరకాల విమర్శలు చేస్తోంది. తమ దగ్గరే యుద్ధ విమానాలను.. మిస్సైల్స్ కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తోంది. అయినప్పటికీ మిగతా దేశాలు వినిపించుకోవడం లేదు. పైగా ఇటీవల ఇరాన్ యుద్ధంలో అమెరికా రూపొందించిన మిస్సైల్స్ లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. దీంతో అమెరికా ఆయుధ సామర్థ్యం ప్రపంచ దేశాల ముందు తల వంపులకు గురైంది. అందువల్లే ఏ దేశం కూడా అమెరికా ఆయుధాల గురించి మాట్లాడటం లేదు. వాటిని కొనుగోలు చేయాలని అనుకోవడం లేదు.
