Homeజాతీయ వార్తలుIndia BrahMos missile latest update: పదునెక్కిన భారత బ్రహాస్త్రం.. పాకిస్తాన్, చైనా గుండెలు దడదడ!

India BrahMos missile latest update: పదునెక్కిన భారత బ్రహాస్త్రం.. పాకిస్తాన్, చైనా గుండెలు దడదడ!

India BrahMos missile latest update: ఆపరేషన్‌ సిందూర్‌లో 96 గంటల్లో పాకిస్తాన్‌తోపాటు యావత్‌ ప్రపంచానికి మన బ్రహ్మోస్‌ శక్తి తెలిసింది. పాకిస్తాన్‌ అల్లాడిపోయింది. ఎయిర్‌ డిఫెన్స్‌ ధ్వంసమైంది. యావత్‌ ప్రపంచం మనవైపు చూసింది. వియత్నాం, ఇండోనేషియా తమ భద్రత కోసం బ్రహ్మోస్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి. బ్రహ్మోస్‌ ఒక అద్భుతం.

రేంజ్‌ పెంపు..
బ్రహ్మోస్‌ క్షిపణి సామర్థ్యం ఇప్పుడు డబుల్‌ అయింది. మొదట దీని రేంజ్‌ 200 నుంచి 300 కిలో మీటర్లు ఉడేది. తర్వాత 500 కిలోమీటర్లకు పెంచారు. ఇప్పుడు 800 కిలోమీటర్లకు భారత రక్షణ పరిశోధన సంస్థ పెంచింది. ఇక వేగం కూడా శబ్ద వేగంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. అక్యూరసిని కూడా 1 మీటర్‌కు తగ్గించింది. దీంతో ఇప్పుడు బ్రహ్మోస్‌ పాకిస్తాన్‌ మొత్తాన్ని కవర్‌ చేస్తుంది. ఆఫ్గానిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను కూడా టార్గెట్‌ చేయగలదు. చైనా సరిహద్దులో మోహరిస్తే, లోపలి ప్రాంతాల వరకు దాడి చేసే సామర్థ్యం ఉంది.

శత్రువుకు అవకాశమే లేదు
బ్రహ్మోస్‌ ఇప్పుడు శబ్ద వేగానికి 3 రెట్లు వేగంతో – గంటకు 3,700 కి.మీ పైగా వేగంతో దూసుకెళ్లేలా అభివృద్ధి చేశారు. మనం ప్రయోగించగానే శత్రుదేశాల రాడార్‌ గుర్తించి సిగ్నల్స్‌ ఇస్తుంది, ఎయిర్‌ డిఫెన్స్‌ యాక్టివ్‌ అవుతుంది. కానీ అంతకంటే ముందే బ్రహ్మోస్‌ టార్గెట్‌ను ఛేదిస్తుంది.

దేశీయ ఇంజిన్‌..
బ్రహ్మోస్‌లో వాడే రాంజెట్‌ ఇంజిన్‌ పూర్తిగా భారత్‌లోనే తయారైంది. విదేశాలపై ఆధారపడటం లేదు. ఇది ఒక గొప్ప ఆత్మనిర్భర విజయం. బ్రహ్మోస్‌ను నాలుగు వేదికల నుంచి ప్రయోగించవచ్చు. గగనతలం నుంచి సుఖోయ్‌–30 యుద్ధ విమానాల నుంచి, భూతలం నుంచి మొబైల్‌ లాంచర్లద్వారా, సముద్రంలో యుద్ధ నౌకల నుంచి, మునిగి ఉన్న సబ్‌మెరైన్ల నుంచి ప్రయోగించే వీలు ఉంది. ఇది ‘ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌‘ సూత్రంపై పనిచేస్తుంది. ఒకసారి ప్రయోగించిన తర్వాత దానిని మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం లేదు.

Also Read: ఐపీఎల్‌ సీజన్‌లో సైలెంట్‌ ఆపరేషన్‌.. పాకిస్తాన్‌లో సెంచరీ కొట్టిన అజ్ఞాత సాయుధులు!

వ్యూహాత్మక మోహరింపు..
బ్రహ్మాస్త్రాని పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మోహరిస్తే పాకిస్తాన్‌ మొత్తం రేంజ్‌లోకి వస్తుంది. చైనా లోపలి ప్రాంతాల వరకు దాడి చేయవచ్చు. గల్వాన్‌ లోయ వంటి ఉద్రిక్త ప్రాంతాల్లో శక్తివంతమైన నిరోధక శక్తి. అండమాన్‌లో బ్రహ్మోస్‌ను మోహరిస్తే మలక్కా జలసంధి పూర్తిగా కవర్‌ అవుతుంది. సుందా జలసంధి, లంబాక్‌ జలసంధి కూడా రక్షణలోకి వస్తాయి. చైనా నౌకాదళ చలనచలనాలపై నిఘా, నియంత్రణ సాధ్యం.

కొనుగోలు ఆసక్తి..
బ్రహ్మోస్‌ ప్రదర్శించిన సామర్థ్యంతో ప్రపంచ దేశాలు ఆకర్షితులయ్యాయి. వియత్నాం తమ భద్రత కోసం బ్రహ్మోస్‌ కొనుగోలుకు చర్చలు జరుపుతోంది. ఇండోనేషియా భద్రతా అవసరాల కోసం ఒప్పందానికి సిద్ధం అయింది. ఫిలిప్పీన్స్‌ ఇప్పటికే కొనుగోలు చేసింది. మరిన్ని ఆసియా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.

బ్రహ్మోస్‌ ఇప్పుడు కేవలం ఒక క్షిపణి కాదు. అది భారత్‌ బ్రహ్మాస్త్రం. పాకిస్తాన్‌ వణికింది, చైనా జాగ్రత్త పడింది, ప్రపంచం మెచ్చింది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు కొనుగోలుకు సిద్ధమయ్యాయి. ఇది భారత్‌ను అత్యంత శక్తివంతమైన రక్షణ శక్తిగా నిలబెట్టింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version