దేశ ఆర్ధిక వ్యవస్థను 2022 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకు వెడతామని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజల ముందు ఒక కలల ప్రపంచాన్ని ఆవిష్కరించారు.
అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఉన్న మూడు లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థలో లక్ష కోట్ల డాలర్ల మేరకు కోల్పోవలసి వస్తుందని ప్రముఖ ఆర్ధిక వేత్త, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భావిస్తున్నారు.
ప్రపంచ బ్యాంకు వెబనార్ లో భారత ఆర్ధిక వ్యవస్థపై కరోనా ప్రభావం అంశం గురించి మాట్లాడుతూ కరోనా ముందు కూడా దేశ ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదని గుర్తు చేశారు. పెద్ద పెద్ద స్టిమ్యులస్ ప్యాకేజిలను అందించడానికి కూడా ప్రభుత్వం వద్ద తక్కువ మార్గాలున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం పన్నుల వారానికి 60–70 బిలియన్ డాలర్లను సంపాదిస్తుందని చెబుతూ పేదలకు, ధనవంతులకు మధ్య తేడా ఇంకా పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పైనే దృష్టిసారించాలని అయన సూచించారు. లేని పక్షంలో మరో 20 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడానికి గల మార్గాలను ప్రభుత్వం వెతకాలని చెబుతూనే, కానీ వాటివల్ల కూడా ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయని స్పష్టం చేశారు. బయట నుంచి మరింత పెట్టుబడులు పొందేందుకు సంస్కరణలు తీసుకురావాలని రాజన్ సూచించారు.
వ్యక్తుల పరంగా చూస్తే, ప్రజల ఆరోగ్యం, భద్రతలకు మొదటి రెండు ప్రాధాన్యతలు వచ్చాయని, ఇప్పటి వరకు ఇవి మూడు, నాలుగు స్థానాలలో ఉన్నాయని రాజన్ పేర్కొన్నారు. ఇతర వాటిపై ఖర్చులు తగ్గి, ఆరోగ్యంపై ఖర్చులు పెరిగాయి. ప్రజలు కూడా ఇక నుంచి ఖరీదైన ఉత్పత్తులపై ఖర్చు తగ్గించి, చౌకరకం వస్తువులు కొనేందుకే మొగ్గుచూపుతారని ఆయన భావిస్తున్నారు.
గూడ్స్ ను కూడా గుడ్ కాస్ట్స్, బాడ్ కాస్ట్స్ లుగా వర్గీకరించారు. గుడ్ కాస్ట్స్ అంటే డిజిటైజేషన్, టెక్ కాస్ట్స్, డిజిటల్ మార్కెటింగ్, బెస్ట్ ఎంప్లాయూస్. బాడ్ కాస్ట్స్ అంటే అనసరమైన ఖర్చులు. హోమ్ ఎడ్యుకేషన్, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, హోమ్ ఫిట్‌నెస్ వంటి వాటిల్లో డిజిటల్ ఎకానమీ పూర్తిగా పెరుగుతోందని చెప్పారు.
అయితే స్టేక్‌హోల్డర్స్ మధ్య నమ్మకం పోయింది. వెండర్లు, కస్టమర్లు, ఎంప్లాయిస్, బారోవర్స్, బ్యాంక్‌ల మధ్య నమ్మకం తగ్గిపోయింది. సప్లయిర్స్, ఎంప్లాయీస్‌తో ఓపెన్ కన్వర్జేషన్స్ ఉండాలని వివరించారు.
ఈ కరోనా సంక్షోభంలో కూడా విన్నర్లు, లూజర్లు ఉంటారని చెబుతూ విన్నర్లు ఈ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తారని తెలిపారు. చైనాకు ఎదురుదెబ్బ తగలవచ్చని పేర్కొంటూ భారత్ ఈ అవకాశాన్ని వాడుకోవాలని రాజన్ సూచించారు. కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌గా మారాలని, భారత్ లోకి లిక్విడిటీని ఆకర్షించాలని పేర్కొన్నారు.