ప్రతి ఒక్కరూ సెంచరీ కొట్టాలని ఉంటుంది. కానీ అది కొందరికే సాధ్యమవుతుంది. అబ్బో మా తాత వందేళ్లు బతికాడు.. గడుక తినేవాడు.. జొన్నలు, సజ్జలు, రాగులు తిని ఆయన వృద్ధాప్యంలోనూ చెంగు మంటూ పనులు చేసేవాడని మన పెద్దలు చెబుతుంటారు.. అదే మన దగ్గరికి వచ్చేసరికి మన నాన్నలు 60 ఏళ్లకే వృద్ధాప్యంలోకి జారీ చనిపోతున్నారు. మన తాతల తరం 100 ఏళ్లు బతికితే మందుల తిండితో మన నాన్నల ఆయుర్థాయం కేవలం 60 ఏళ్లకే పడిపోయింది. కొంతమందే 80 ఏళ్ల వరకు బతుకుతున్నారు.
Also Read: ఉపాధి జాబ్ కార్డ్ పై దీపికా, జాక్వెలిన్ ఫోటోలు .. అవాక్కైన నెటిజన్లు..?
కానీ ఇప్పుడు న్యూస్ అందింది. ఆధునిక పోకడలు, మందుల తిండి, ఫెస్టిసైడ్ ధాన్యాన్ని తింటున్న మానవుడి ఆయుర్థాయం పడిపోతోంది. మారుతున్న పరిస్థితుల్లో రోజురోజుకు మానవుడి సగటు ఆయుర్దాయం తగ్గుతూ వస్తోంది. రోజురోజుకు పుట్టుకొస్తున్న కొత్త రోగాలు.. పెరుగుతున్న కాలుష్యంతో సగటు మనిషి ఆయుర్ధాయం మాత్రం తగ్గుందన్నది వాస్తవం. కాగా కొన్ని దేశాల్లో మాత్రం సగటు ఆయుర్ధాయం 80కిపై మాటే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అయితే గుడ్ న్యూస్ ఏంటంటే.. భారత్ లో ఆయుర్థాయం పెరిగింది. భారతీయుల సగటు ఆయుష్సు(జీవించే కాలం)కు సంబంధించి తాజాగా ‘లాన్సెట్ జర్నల్’ ఓ నివేదికను ప్రచురించింది. 1990లో భారతీయుల సగటు జీవిత కాలం 59.6 ఏళ్లు ఉండగా.. అది 2019 నాటికి వైద్య సదుపాయాలు, పౌష్టికాహారంపై ప్రాధాన్యత పెరిగి 70.8 ఏళ్లకు చేరింది. 30 ఏళ్ల కాలంలో భారతీయుడి సగటు ఆయుష్షు కాలం పదేళ్లు పెరిగినా.. భారత్ లో మాత్రం పలు రాష్ట్రాల మధ్య తేడాలు ఉన్నట్లు లాన్సెట్ వెల్లడించింది.
ముఖ్యంగా దేశంలోనే అత్యధిక అక్షరాస్యత గల కేరళ రాష్ట్రంలో సగటు ఆయుష్సు జీవితాకం 77.3 ఏళ్లకు చేరుకుంది. ఇక అత్యంత తక్కువగా ఉత్తరప్రదేశ్ లో మనిషి జీవితకాలం 66.9 ఏళ్లకు చేరినట్లు నివేదిక వెల్లడించింది.
Also Read: ఒక్క వర్షం.. పదుల సంఖ్యలో ప్రాణాలు..
ప్రపంచంలో ఆయుర్థాయం 90ఏళ్లు సగటు ఉన్న తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డు సృష్టించింది. ఈ దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఆదర్శంగా నిలుస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇక్కడి ప్రజలకు తక్కువ రక్త పోటు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఉన్నాయి.