Bumper Offer: మన దేశంలో వివాహ వ్యవస్థ బలంగా ఉంది. వివాహం చేసుకున్న క్రమంలో ఎవరి భార్యపై వారికే అధికారం ఉంటుంది. కానీ విదేశాల్లో మాత్రం విచ్చలవిడితనం ఉంటుంది. మన దేశంలో ఇలాంటి వాటికి ఆస్కారం ఉండదనే తెలుసు.
కానీ మధ్యప్రదేశ్ లో మాత్రం ఇప్పటికి కూడా వేరొకరి భార్యను మనం అద్దెకు తెచ్చుకుని సంసారం చేసే అవకాశం ఉంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. దీనికి సంబంధించిన వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతాం.

వేరొకరి భార్యను మనం తీసుకొచ్చే క్రమంలో స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకుని భార్యను వేరే వారికి అప్పగించడం ఇక్కడ ఆచారంగా ఉంది. దీంతో ఆదాయం సమకూర్చుకుంటారు. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో ఈ సంప్రదాయం మనుగడలో ఉండటం విశేషం. ధడిచా అని పిలిచే ఈ ఆచారంతో భార్యలు వేరే వారి ఆధీనంలోకి వెళ్లాల్సి ఉంటుంది.

ధనవంతులు తమ అవసరాలు తీర్చేందుకు భార్యలను నెల లేదా సంవత్సరం ప్రాతిపదికపై ఒప్పందం చేసుకుని తీసుకెళ్లి మళ్లీ తిరిగి పంపిస్తారు. దీంతో ఎంతో కొంత ఆదాయాన్ని ఆమె భర్తకు అందజేస్తారు. ఇలా ఈ ఆచారం ఇక్కడ ప్రముఖంగా నడుస్తోంది. రూ.10 లేదా 100 ల స్టాంపు పేపర్లపై సంతకాలు చేసుకుని మరీ తీసుకెళ్తుంటారు. అక్కడకు వెళ్లిన ఆమె వారికి కూడా భార్యగానే ప్రవర్తించాలి. కుటుంబ అవసరాల్లో పాలు పంచుకోవాల్సి ఉంటుంది.
ఇలాంటి ఆచారం గుజరాత్ రాష్ర్టంలో కూడా అమల్లో ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో ఇక్కడ ఈ ఆచారం సంప్రదాయంగా భావిస్తారట. తమ భార్యలను ధనవంతులకు అద్దెకు ఇస్తూ పెద్ద మొత్తంలో సంపాదన ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో కూడా ఇలాంటి వింత ఆచారాలు ఇప్పటికి కూడా మనుగడలో ఉండటం గమనార్హం.
Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో దొంగతనం, బెంబేలెత్తిపోయిన కాజల్