KCR కొన్ని రోజులుగా ఓ ఫ్యాన్ కంపెనీ యాడ్ అన్ని టీవీ చానళ్లలో ఆకట్టుకుంటోంది. వేసవి కాలం కావడంతో సదరు ఫ్యాన్ల తయారీ సంస్థ ప్రత్యేకంగా యాడ్ తయారు చేయించింది. తెలుగులో వస్తున్న ఈ ఆయడ్‌లో ‘ఇండియా ఊగులాడుతోంది’ అని పాట వస్తుంది. చాలా మంది ఈ యాడ్ విని ఊగులాడడం ఏందిరా అంటూ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఈ యాడ్‌ను కేసీఆర్ వీడియోలకు యాడ్ చేసి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.. కొంతమంది యమలీల సినిమాలోని బుడి బుడి అడుగుల తప్పటడుగులే మణిమానిక్యాలు.. అనే పాట జోడించారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్ర సభలో తడబడిన నడక..
మహారాష్ట్రలోని నాగపూర్‌లో కేసీఆర్ రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్, వేదికపై వెళ్లేందుకు నడుస్తూ తడబడ్డారు. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ఇదే చాన్స్ అన్నట్లు విపక్షాల సోషల్ మీడియా ప్రతినిధులతోపాటు, కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను తమకు నచ్చిన పాట జోడించి ట్రోల్ చేస్తున్నారు.
గతంలోనూ అనేక వీడియోలు..
కేసీఆర్‌ను ట్రోల్ చేయడం ఇది కొత్తేం కాదు. గతంలో హెలిక్యాప్టర్ దిగుతూ తూలిపడిన వీడియో, కొన్ని సభల్లో కేసీఆర్ మాట తీరును కూడా నెటిజన్లు, విపక్ష నేతలు ట్రోల్ చేశారు. ఈ వీడియోను చూసిన వారికి నవ్వులే నవ్వులు.. మళ్లీ చాలా రోజుల తర్వాత కేసీఆర్ తడబడిన వీడియో విపక్షాలకు దొరికింది. దీంతో నెట్టింట్లో ఆటాడుకుంటున్నారు.
మద్యం మానేసిన కేసీఆర్..
ఇదిలా ఉంటే కేసీఆర్ మద్యం తాగడం మానేశాడని అప్పట్లో ప్రచారం జరిగింది. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు, బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. గతంలో తాగుబోతు అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ కూడా ఫైర్ అయ్యారు. ‘నువ్వు నాకు మందు పోసినవా.. సోడా కలిపినవా’ అని వెటకారంగా మాట్లాడారు.
కేసీఆర్ మద్యం మానేశాడని భావిస్తున్న తరుణంలో మహారాష్ట్ర సభలో కెమెరాలకు తడబడుతూ చిక్కిన వీడియోతో మళ్లీ మద్యం తాగుతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు తీరొక్క కామెంట్లు పెడుతున్నారు. ఏ స్టడీ అని కొందరు.. పొద్దుగాల 90 ఎంఎల్ వేస్తే గిట్లనే ఉంటది అని, ఏం బ్రాండ్ బాపు అని, నవ్వీ.. నవ్వీ కడుపు నొస్తంది అని, మీమ్స్‌తో కొందరు తమ భావాలను వ్యక్తం చేశారు.