
సాధారణంగా రాజకీయాలు అంటే.. అధికార పక్షం ప్రతిపక్ష పార్టీ మీద మాటల యుద్ధం చేస్తుంది. లేదంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షంపై విరుచుకుపడుతుంటుంది. అది కామన్. కానీ.. ఏపీలో మాత్రం రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ అధికార పార్టీ నేతలు విపక్షాలపై వాడాల్సిన అస్త్రాలను సొంత పార్టీ నేతలపైనే వాడేస్తున్నారు. ముఖ్యంగా వారి అవినీతిని ప్రస్తావిస్తూ టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సదరు ఆరోపణలపై ఎదురుదాడి చేయలేక, అలాగని అధిష్టానానికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయలేక వారు సతమతం అవుతున్నారు.
Also Read: అచ్చెన్నా.. నీ లేఖ సూపరన్నా..!
ఎన్నో ఆటుపోట్ల మధ్య జగన్ ఫస్ట్‌టైమ్ అధికారం చేపట్టారు. అధికారం అంటే కూడా మామూలు అధికారం కాదు.. తిరుగులేని మెజార్టీతో.. తిరుగులేని సంఖ్యాబలంతో సీఎం అయ్యారు. కరోనాకు ముందు మొదలైన స్థానిక ఎన్నికల్లో సైతం ఈ బలంతోనే ఏకగ్రీవాలకు సైతం ప్రయత్నించింది. ఇప్పుడు టార్గెట్ చేయాల్సిన అవసరం లేనంతగా విపక్షాలు కూడా బలహీనంగా కనిపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీలోని నేతలే పరస్పరం ప్రత్యర్థులుగా మారిపోతున్నారు.
తమ నియోజకవర్గాల్లో.. జిల్లాల్లో టీడీపీని టార్గెట్ చేయాల్సిన వైసీపీకి ఆ అవసరం లేకపోవడంతో వారిలో వారే ఆరోపణలకు దిగుతున్నారు. వైసీపీలో జరుగుతున్న ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేల పోరుకు నరసాపురంలో బీజం పడింది. వైసీపీ తరఫున గెలిచిన రఘురామకృష్ణంరాజు పార్టీపై ధిక్కార స్వరం వినిపించడం మొదలుపెట్టగానే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనపై విమర్శలు ప్రారంభించారు. ఆ తర్వాత ఈ పోరు దాడులకు కూడా దారి తీస్తుందన్న భయంతో రఘురామరాజు ఢిల్లీ వెళ్లి అక్కడే ఉండిపోయారు.
Also Read: ఆన్ లైన్ ట్రెండ్స్ లో దూసుకెళుతున్న మోదీ.. జగన్..!
అక్కడ అలా ఉంటే.. విశాఖలో విజయసాయిరెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్‌గా పోరు సాగుతోంది. ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన విశాఖ ఎమ్మెల్యేలను జగన్ పిలిపించుకుని ఇప్పటికే క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీఆర్సీ భేటీలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిగా సాగిన వాగ్వాదం వైసీపీలో తీవ్ర చర్చకు తావిస్తోంది. మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యేలున్న ఎంపీ స్థానాల పరిధిని మినహాయిస్తే వైసీపీ ఎంపీలు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆధిపత్య పోరు సాగుతోంది. తమ నియోజకవర్గాల పరిధిలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో తమ మాటే నెగ్గాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇందులో ఎంపీల జోక్యాన్ని సహించలేకపోతున్నారు. ఫలితంగా ఎంపీలు అయోమయంలో పడ్డారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్