
దేశానికి ప్రధాని అయిన నరేంద్రమోడీ దక్షిణాదికి వచ్చేది చాలా తక్కువ. ఆయన ఓట్లు సీట్లు అన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాల నుంచే వస్తాయి. తమిళనాడు, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే అధికారం. అందుకే ఇక్కడి వారితో మోడీకి అనుబంధం, ఆత్మీయత తక్కువే.
అయితే మోడీ మేనియా కేరళలలోనూ ప్రతిధ్వనించింది. మోడీకి కేరళలో ఇంత ఫాలోయింగ్ ఉందా అనేలా..
కేరళ రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని అతిపెద్ద ఎన్నికల సభగా మోడీ మీటింగ్ సాగింది.
కేరళలోని అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటములపై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రెండు కూటములతో విసిగిపోయారని.. బీజేపీ అభివృద్ధి ఏజెండాను కోరుకుంటున్నారని మోడీ విమర్శించారు.
‘మోదీ మోదీ’ నినాదాలతో కమ్యూనిస్టుల గుండెల్లో గునపాలు దించేశారు. తిరువనంతపురం ప్రజలు. పట్టుమని పాతికవేల మంది కూడా పట్టని స్టేడియంలో లక్ష మంది తరలివచ్చి.. మోడీ నామస్మరణతో అక్కడి కమ్యూనిస్టు, కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకు పుట్టించారు. కేరళలో మోడీకి ఇంత ఆదరణ ఉంటుందా? అనేలా మోడీ సభకు జనాలు పోటెత్తి హర్షధ్వానాలు చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.