Pakistan Prime Minister Imran Khan: పాకిస్తాన్ లో మరో సంక్షోభం రానుంది. ఇప్పటికే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల దాడి పెరుగుతోంది. ఆయన సారధ్యంలో పాక్ అభివృద్ధి సాధించడం లేదని పలువురి వాదన. దీంతో పాక్ లో ఏ సమయంలోనైనా ఇమ్రాన్ బాధ్యతలు తొలగించవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తనుందని తెలుస్తోంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ది ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్ నియామకం విషయంలో ప్రభుత్వానికి సైన్యానికి మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ గా మొదట ఇమ్రాన్ సూచించిన వ్యక్తినే నియమించినా చివరకు సైన్యాధ్యక్షుడు ఖమర్ జావేద్ బాజ్వా సూచించిన మరో లెఫ్టినెంట్ జనరల్ నదీం అంజుమ్ కే పగ్గాలు అప్పగించారు.

అప్పటి నుంచి సైన్యం ప్రధానికి మధ్య అగాధం పెరుగుతోంది. గతంలో కూడా సైన్యానికి ప్రధానికి పడని సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో పాక్ లో ఏం జరగబోతోందనే దానిపై అందరికి అనుమానాలు వస్తున్నాయి. ఇమ్రాన్ పాలనలో పాక్ అధ్వానంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నిర్ణయాలతో కూడా కొంత వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది కొందరి వాదన. దేశ రాజకీయాల్లో సైన్యం పాత్ర తటస్థమే అయినా పరిపాలన సవ్యంగా సాగాలని కోరుకుంటుంటారు. అందుకే ఇమ్రాన్ పాత్రపై అందరికి సందేహాలు వస్తున్నాయి.
Also Read: యూపీలో బీజేపీ గెలుపునకు ఎంఐఎం బాటలు వేసిందా?
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీలో ఉంటూ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాల అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడం తెలిసిందే. ఇందులో 24 మంది చట్టసభల సభ్యులున్ారు. దీంతో వారికి శనివారం షోకాజ్ నోటీసులు అందజేశారు. అవిశ్వాస తీర్మానంపై ఈనెల 28న ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించేందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి పాక్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఇమ్రాన్ భవితవ్యం రసకందాయంలో పడనుంది. గతంలో కూడా ప్రధానిని దించి సైన్యం పాలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పర్వేజ్ ముషారఫ్ అలాగే చేసి ఏకచత్రాధిపత్యం వహించి పాక్ లో తిరుగులేని నేతగా ఎదిగిన తీరు అందరికి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్ ఏమిటో అనే అనుమానాలు వస్తున్నాయి.
Also Read: ఈసారి కేసీఆర్ మునుగోడు నుంచే పోటీకి దిగుతారా?
Recommended Video: