జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ను సీఎం జగన్ అరెస్టు చేయించారు. దీంతో తన గోతి తానే తీసుకున్నట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేయడంతోనే ఈ విధంగా కేసులో ఇరికించి అరెస్టు చేయించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు ఎదురుతిరిగినా జగన్ ఇలాగే చేస్తారని చెబుతున్నారు. కృష్ణం రాజు అరెస్టుతో రాజకీయం కొత్త మలుపు తిరగడం ఖాయమని చెబుతున్నారు
సీబీఐ కేసులో చిక్కులే..
రఘురామ కృష్ణంరాజు ను అరెస్టు చేయించడంతో జగన్ కు చిక్కులు ఏర్పడనున్నాయి. ఇన్నాళ్లు కామ్ గా ఉన్న కృష్ణం రాజు బెయిల్ పై విడుదలైతే జగన్ కు సమస్యలే ఎదురు కానున్నాయి. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకే తనపై కక్ష్యపూరితంగా వ్యవహరించి అకారణంగా కేసు వేయించి అరెస్టు చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దురుద్దేశంతోనే..
జగన్ కావాలనే దురుద్దేశంతనే కృష్ణం రాజుపై కేసు పెట్టించి అరెస్టు చేయించారని తెలుస్తోంది. దీంతో జగన్ కు ఎదురు తిరిగితే ఫలితం ఎలా ఉంటుందోనని చెప్పకనే చెప్పారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశం పగేనని స్పష్టమవుతోంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు మారనున్నాయి. కృష్ణం రాజు సైతం ఇదే విధంగా జగన్ పై కక్ష్య తీర్చుకోవాలని భావిస్తారని పలువురు చెబుతున్నారు. అందుకే రాష్ర్టంలో రాజకీయవేడి రగులుకుందని సమాచారం.
ఏ మేరకు ప్రభావం?
రాష్ర్టంలో రఘురామ కృష్ణం రాజు అరెస్టు ఏ మేరకు ప్రభావం చూపనుంది. ఇప్పటికే ప్రతిపక్షాల గొంతు నొక్కిన జగన్ తనపై ఆరోపణలు చేసిన కృష్ణం రాజును సైతం జైలుకు పంపడం చర్చనీయాంశమైంది. ఎవరు మాట్లాడితే వారిని నోరు మూయించే పనిలో భాగంగా అస్టులు చేయడంతో రాష్ర్టంలో పరిస్థితి ఎలా మారబోతోంది. చంద్రబాబు, లోకేష్ లపై సైతం ఇదే విధంగా విమర్శలు చేసి వారిని కట్టడి చేసిన జగన్ అదే దారిలో వెళుతూ కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే పంథాలో కొనసాగితే రాబోయే ఎన్నికల్లో జగన్ బోర్లా పడడం ఖాయమని చెబుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోవడం వేరు రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడం వేరని బెబుతున్నారు. వైసీపీ కార్యకర్తలు సైతం అదే దారిలో వెళుతూ ఎదురొచ్చిన దాడులకు సైతం తెగబడడం వారి అనైతికం. ఏది ఏమైనా రాష్ర్టంలో సుభిక్ష పాలన అందించాలంటే కక్ష్యలు, కార్పణ్యాలు లేని ఆంధ్రప్రదేశ్ కావాలంటే నేతల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.