https://oktelugu.com/

Weather Report: మండే ఎండలు.. మార్చి మొదటి వారం నుంచే భగభగలు..

Weather Report:  ఈసారి ఎండలు మోత మోగనున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. చలితీవ్రత తగ్గి ఎండలు భగభగ మండుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈమేరకు దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. గత రెండు రోజులుగా రాత్రివేళల్లో చలితీవ్రత తగ్గి గాలిలోతేమ శాతం పెరిగినట్లు ఐఎండీ వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2022 9:11 pm
    Follow us on

    Weather Report:  ఈసారి ఎండలు మోత మోగనున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. చలితీవ్రత తగ్గి ఎండలు భగభగ మండుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈమేరకు దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

    తాజాగా తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. గత రెండు రోజులుగా రాత్రివేళల్లో చలితీవ్రత తగ్గి గాలిలోతేమ శాతం పెరిగినట్లు ఐఎండీ వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్ , జహీరాబాద్ సహా మహారాష్ట్రలోని షోలాపూర్, నాందేడ్ పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

    హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదు కాగా.. గరిష్టంగా 33-34 డిగ్రీలకు చేరుకుంది. ఇక మార్చి మొదటి వారం నుంచే దేశంలో ఎండల తీవ్రత పెరగనున్నట్లు ఐఎండీ అంచనావేసింది.

    నిజానికి ఫిబ్రవరి-మార్చిలో పెద్దగా ఎండతీవ్రత మొదలుకాదు. సాధారణంగా 34 డిగ్రీలు ఉంటుంది. రాత్రి 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అయితే ఈసారి తక్కువ ఎత్తులో వీస్తున్న వాయువ్య గాలులతో వాతావరణ మార్పులు చెంది భగ్గుమంటోంది. రాత్రిళ్లు ఉక్కపోతగా.. పగలు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ -మే నెలల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ఐఎండీ అంచనావేసింది.