
అగ్రరాజ్యం అమెరికా.. అధ్యక్ష ఎన్నికల్లోనూ తన దర్పాన్ని ప్రదర్శిస్తోంది. ఎన్నికల ప్రచారానికి వేలకోట్లు చేస్తూ ఔరా అనిపిస్తోంది. నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల జరుగనున్నాయి. దీంతో అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. వేల కోట్ల రూపాయాలను అభ్యర్థులు మంచినీళ్లప్రాయం ఖర్చు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Also Read: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భూకంపం.. ఎందుకొస్తుందంటే?
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇక డెమొక్రాట్స్ తరుఫున జో బిడైన్న్ పోటీ చేస్తున్నాడు. వీరిద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. వీరిద్దరు కూడా అడ్వర్టయిజ్మెంట్ల కోసం 105రోజుల్లో చేసిన ఖర్చు చూస్తే వామ్మో అనాల్సిందే. జూన్ 1నుంచి సెప్టెంబర్ 13 మధ్య వీరిద్దరు అడ్వర్టయిజ్మెంట్ల కోసం చేసిన ఖర్చు ఏకంగా 68.8మిలియన్లు డాలర్లు(దాదాపు 502కోట్ల రూపాయాలు)గా తేలింది.
ఇక ఆగస్టు 10నుంచి సెప్టెంబర్ 13మధ్యలో 40శాతం సొమ్ము ఖర్చును కేవలం ఫేస్‌బుక్.. ఇన్‌స్టాగ్రామ్‌లపైనే ఇద్దరు అభ్యర్థులు ఖర్చు చేసినట్లు సైరాక్యూస్ యూనివర్శిటీ ఓ అధ్యయనంలో వెల్లడించింది. అదేవిధంగా ఆన్‌లైన్ యాడ్స్‌కు 27మిలియన్ డాలర్లు(దాదాపు 197 కోట్లు) ఖర్చు పెట్టారు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ కూడా దాదాపు ఇదేస్థాయిలో ఖర్చు పెట్టారని యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.
ప్రస్తుతం వీరిద్దరు యాడ్స్ కోసం పోటాపోటీ ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ట్రంప్.. బైడెన్లు ఇద్దరు కూడా 70శాతం నిధులను ఓటర్లను ఆకర్షించేందుకు.. 30శాతం నిధులు ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారు. అమెరికాలో టీవీలో యాడ్స్ చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో వీరిద్దరు సోషల్ మీడియాలోనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారట.
Also Read: న్యాయవ్యవస్థతో జగన్ ఢీ.. మతలబేంటి? ఏం జరుగనుంది?
ఇందులో డోనాల్డ్ ట్రంప్ పురుష ఓటర్లు లక్ష్యంగా చేసుకొని ఎక్కువ యాడ్స్ ఇస్తుండగా.. బైడెన్ మహిళా ఓటర్లు లక్ష్యంగా చేసుకొని ఎక్కువ యాడ్స్ ఇస్తున్నారట. ఈ ఖర్చు ఎన్నికల సమయానికి రెట్టింపు అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.