https://oktelugu.com/

BJP Politics: రాజకీయ ప్రత్యుర్థులే అవినీతి పరులా..? సొంత పార్టీలోని వారు నీతిమంతులా..?

BJP Politics: రాజకీయ నాయకుడిగా ఎంత దోచుకున్నా.. ఎన్ని తప్పులు చేసిన పర్వాలేదు. అవన్నీ మాయమైపోవాలంటే బీజేపీలో చేరితే చాలా..!? ఆ పార్టీలో చేరిన తరువాత మీ దగ్గరికి ఈడీ అధికారులు రారు.. కనీసం పోలీసులు కన్నెత్తి చూడరు.. ఇప్పుడు దేశంలో ఇదే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని వరుసబెట్టి వారం రోజుల పాటు ఈడీ అధికారులు గంటల కొద్దీ విచారిస్తున్నారు. రాహుల్ గాంధీ పరిస్థితి ఇలా ఉంటే […]

Written By:
  • NARESH
  • , Updated On : June 17, 2022 / 11:44 AM IST
    Follow us on

    BJP Politics: రాజకీయ నాయకుడిగా ఎంత దోచుకున్నా.. ఎన్ని తప్పులు చేసిన పర్వాలేదు. అవన్నీ మాయమైపోవాలంటే బీజేపీలో చేరితే చాలా..!? ఆ పార్టీలో చేరిన తరువాత మీ దగ్గరికి ఈడీ అధికారులు రారు.. కనీసం పోలీసులు కన్నెత్తి చూడరు.. ఇప్పుడు దేశంలో ఇదే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని వరుసబెట్టి వారం రోజుల పాటు ఈడీ అధికారులు గంటల కొద్దీ విచారిస్తున్నారు. రాహుల్ గాంధీ పరిస్థితి ఇలా ఉంటే  మామూలు రాజకీయనాయకులది ఎలా ఉండాలి..? అందుకే దీనికొక్కటే మార్గం.. బీజేపీలో చేరడం!? అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఇతర పార్టీల్లో కొనసాగి అవినీతి పరులైన వారు.. బీజేపీలో చేరిన తరువాత వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీస సమన్లు కూడా జారీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇదంతా తనకు ఎదురు లేకుండా ఉండేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర అని కొందరు ఆరోపిస్తున్నారు.

    దేశంలో ఇప్పటి వరకు అవినీతి పెరిగిపోయిందని, దానిని అంతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పలు సార్లు చెప్పారు. అలాంటప్పుడు అవినీతి నాయకులను తమ పార్టీలోకి ఎందుకు చేర్చుకోవాలి..? వారిపై ఈగ వాలకుండా ఎందుకు చూసుకోవాలి..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అస్సాం  ముఖ్యమంత్రి హింత బిశ్వాస్ శర్మ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొన్నారు. కానీ బీజేపీలో చేరిన తరువాత పునీతుడైపోయాడు..!? ఆయన బీజేపీలో చేరిన తరువాత కనీసం సమన్లు పంపించారా..? అలాగే నారాయణ్ రాణే, రామన్ సింగ్, ముకుల్ రాయ్, సువేందు అధికారులపై ఎన్నో అవినీతి కేసులున్నాయి. కానీ వారు బీజేపీలో చేరారు. ఆ తరువాత వారి అవినీతి అంతమైపోయింది..

    ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన సుజనా చౌదరి టీడీపీలో ఉండగా సీబీఐ ఆయన వెంట పడింది. కానీ బీజేపీలో చేరిన తరువాత కనీసం నోటీసు కూడా అందడం లేదు. సీఎం రమేశ్ పై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ బీజేపీలో చేరాక అవన్నీ గప్ చుప్ గా మారిపోయాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నడుస్తోంది. మరి ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? కనీసం కోర్టుకు హాజరుకాకుండా ఉన్న జగన్ ను ఈడీ ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇలాంటి ప్రశ్నలను ఇప్పుడు ఇతర పార్టీల నాయకులు వేస్తున్నారు.

    నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకానక్కర్లేదని 2015లోనే వారికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడు సంవత్సరాల తరువాత ఈడీ రంగంలోకి దిగి వారిపై చర్యలు తీసుకునేందకు రెడీ అవుతోంది. సోనియా, రాహుల్ అవినీతిని మేం ఇక్కడ సమర్థించడం లేదు.వాళ్లు చేశారు..అనుభవిస్తున్నారు. తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు. గతంలోనూ బీజేపీ కీలక నేతలపై ఇలానే నాటి కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపులు చర్యలు చేపట్టింది. ఇప్పటి హోంమంత్రి అమిత్ షాను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కేసులో జైలుకు పంపింది. ఇప్పుడు సోనియా, రాహుల్ లకు అదే పరిస్థితి. అయితే నేషనల్ హెరాల్డ్  కేసులో ఎలాంటి లావాదేవీలు జరగలేదని తేలింది. అయినా ఈడీ మాత్రం ఇంత కాలానికి  విచారణ పేరిట హడావుడి చేస్తున్నారు. వాస్తవానికి వేల కోట్ల కుంభకోణం చేసిన వారు కళ్లముందే ఉన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని ఈడీ కాంగ్రెస్ నాయకుల వెంటపడుతున్నారు.

    ఇలాంటి కేసుల్లో చిక్కకున్న ఇతర నాయకులు బీజేపీలో చేరిన తరువాత వారిపై ఎలాంటి చర్యలు ఉండవని అంటున్నారు. అవినీతి పరులకు బీజేపీ షెల్టర్ గా మారిపోయిందని కొందరు విమర్శిస్తున్నారు. బీజేపీలో కేసుల నుంచి తప్పించుకోవడమే కాకుండా రాజకీయంగా ప్రయోజనం పొందడానికి ఆ పార్టీ వెంటపడుతున్నారు. అయితే వీరందరిని రక్షిస్తూ దేశాన్ని మరింత భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు ఇప్పటికే అవినీతి మరక అంటింది. దాన్ని దూరం చేసుకోలేక ఆ పార్టీ కుదేలైంది. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. ఇప్పుడు బీజేపీ దాన్ని మరింత దెబ్బకొట్టే పనిచేస్తోంది. కానీ తన సొంత పార్టీలోని అవినీతి పరులను శిక్షిస్తేనే బీజేపీకి నిజమైన విశ్వసనీయత.. కాంగ్రెస్ ను దెబ్బకొడితే మిగతా పార్టీలు వణికిపోతాయన్నదే బీజేపీ ప్లాన్. అందుకే ఈడీ విచారణ పేరిటి షో చేస్తోంది. కానీ ముందుగా తన పార్టీని క్లీన్ చేస్తే మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.