కేసీఆర్.. వెంటపడితే వదిలే రకం కాదట!

‘కంటపడితే కనికరిస్తానేమో.. వెంటపడితే వేటాడేస్తా ఓబా’ అంటూ అరవింద సమేతలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగును ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు అన్వయిస్తున్నారు గులాబీ శ్రేణులు. కేసీఆర్ ను శరణు వేడితే అభయమిస్తాడని.. అదే ఎదురు తిరిగితే కాలరాస్తాడని ఎన్నో సార్లు రుజువైంది. ఓటుకు నోటులో చంద్రబాబును, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను అలాగే పంపించాడనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. అదే చంద్రబాబు రాజీపడగా.. రవిప్రకాష్ మాత్రం పోరాడుతున్నారు. కేసీఆర్ తీరు ఎప్పుడైనా ప్రత్యర్థులకు మొదట […]

Written By: NARESH, Updated On : April 12, 2021 5:33 pm
Follow us on

‘కంటపడితే కనికరిస్తానేమో.. వెంటపడితే వేటాడేస్తా ఓబా’ అంటూ అరవింద సమేతలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగును ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు అన్వయిస్తున్నారు గులాబీ శ్రేణులు. కేసీఆర్ ను శరణు వేడితే అభయమిస్తాడని.. అదే ఎదురు తిరిగితే కాలరాస్తాడని ఎన్నో సార్లు రుజువైంది. ఓటుకు నోటులో చంద్రబాబును, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను అలాగే పంపించాడనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. అదే చంద్రబాబు రాజీపడగా.. రవిప్రకాష్ మాత్రం పోరాడుతున్నారు.

కేసీఆర్ తీరు ఎప్పుడైనా ప్రత్యర్థులకు మొదట గట్టి  షాక్ ఇస్తాడు. వారు సహాయం కోరితే కనికరిస్తారు.. రక్షిస్తాడు. కరుడుగట్టిన నయీంను లేపేసి ఆ కేసులో ఉన్న చాలా మంది గులాబీ నేతలు, పోలీసు అధికారులు సేఫ్ అయ్యారు. కేసీఆర్ టార్గెట్ ఎప్పుడూ అత్యంత శత్రువులతోనే ఉంటుందంటారు.

తాజాగా కేసీఆర్ ఫోకస్ చంద్రబాబుపై పడిందని టీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. 2015లో జరిగిన ఓటుకు నోటు కేసును మరోసారి చంద్రబాబు తెరపైకి తెస్తున్నాడని అంటున్నారు. నిందితులలో సత్తుపత్లి ఎమ్మెల్యే, మాజీ టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య ఒకరు. అతడు కొద్దిరోజుల క్రితం టీడీపీ నుంచి టీఆర్ఎస్ కు మారినందున ప్రస్తుతం సేఫ్ సైడ్ లోనే ఉన్నాడు.

ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు ఉన్నారు. ఇందులో చంద్రబాబు తెలంగాణను వీడి ఏపీకి మకాం మార్చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేశారు.

ఇటీవల సండ్ర వెంకటవీరయ్య ఈ కేసు నుంచి డిశ్చార్జి పిటీషన్ కోసం దరఖాస్తు చేయగా.. దానిని ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఏసీబీ కోర్టు తిరస్కరించినా ఆయన అధికార టీఆర్ఎస్ లో ఉండడంతో సేఫ్ సైడ్ లో ఉన్నట్టే.

ఈ కేసులో ఎవరినీ విడిచిపెట్టే పరిస్థితి లేదని.. కేసీఆర్ మరోసారి దీన్ని తెరపైకి తేబోతున్నాడని.. టీఆర్ఎస్ లో చేరినా కూడా సండ్రకు మినహాయింపు ఉండకపోవచ్చని అంటున్నారు. ఖచ్చితంగా రాబోయే 2024 ఎన్నికల ముందు ఈ కేసు యాక్టివ్ అవుతుందని.. బీజేపీతోపాటు ఏపీ సీఎం జగన్ ఒత్తిడి మేరకు కేసీఆర్ ఈ కేసులో చంద్రబాబును బుక్ చేస్తారని ప్రచారం సాగుతోంది. మరి ఇది అవుతుందా? లేదా అన్నది వేచిచూడాలి.