ఎఫైర్ కాదు: బీజేపీ నేత హత్యకు అసలు కారణం ఇదే

తెలంగాణలో కలకలం రేపిన బీజేపీ నేత, వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసు చిక్కుముడి వీడింది. అతడి కాల్ డేటానే నిందితులను ఈజీగా పట్టించేసింది. అందరూ అనుకుంటున్నట్టు వివాహేతర సంబంధం కారణం కాదని పోలీసులు తేల్చారు. ఆయన భార్య చెప్పినట్టు ఎఫైర్ల వల్ల శ్రీనివాస్ హత్య జరగలేదని పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శివను గుర్తించారు. మరో ఇద్దరు […]

Written By: NARESH, Updated On : August 11, 2021 7:34 pm
Follow us on

తెలంగాణలో కలకలం రేపిన బీజేపీ నేత, వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసు చిక్కుముడి వీడింది. అతడి కాల్ డేటానే నిందితులను ఈజీగా పట్టించేసింది. అందరూ అనుకుంటున్నట్టు వివాహేతర సంబంధం కారణం కాదని పోలీసులు తేల్చారు. ఆయన భార్య చెప్పినట్టు ఎఫైర్ల వల్ల శ్రీనివాస్ హత్య జరగలేదని పోలీసులు తెలిపారు.

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శివను గుర్తించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని మెదక్ ఎస్పీ చందన దీప్తి తెలిపారు. 24 గంటల్లోనే కాల్ డేటా ఆధారంగా ఈ కేసును ఛేదించారు. శ్రీనివాస్ ను గొంతు కోసి చంపినట్టుగా పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని తెలిపారు.

తన భర్తకు ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. తరచూ తనతో గొడవ పడేవాడని హత్యకు గురైన వ్యాపారి శ్రీనివాస్ భార్య నిన్న పోలీసులకు చెప్పింది. పలువురితో స్తిరాస్తి గొడవలు ఉన్నట్టు తెలిపింది. ఈ కోణంలో విచారణ జరిపిన పోలీసులు వ్యాపారి శ్రీనివాస్ కాల్ డేటా ఆధారంగా కేసు చేధించారు.

మెదక్ పట్టణానికి చెందిన శివ, పవన్, నిఖల్ ల వద్ద కోటిన్నర రూపాయలు లోన్ తీసుకొని వ్యాపారి శ్రీనివాస్ తిరిగి చెల్లించకుండా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే మాట్లాడడానికి రమ్మని నిఖిల్ స్వయంగా శ్రీనివాస్ కు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ ద్వారానే శ్రీనివాస్ కారులో బయలు దేరి వీరి వద్దకు వచ్చాడు.కారులో ఎంత వాదన జరిగింది. డబ్బుల విషయం తెగకపోవడంతో తమ వెంట తెచ్చిన కత్తులతో శ్రీనివాస్ ను ముగ్గురు పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి కాల్చేశారు. డబ్బుల గొడవనే వ్యాపారి శ్రీనివాస్ హత్యకు దారితీసిందని తెలుస్తోంది.