hyderabad heart surgery to a painter in panjagutta nims hospital : అవయవదానంను మించింది ఈ సృష్టిలో మరొకటి లేదు. చాలా మంది అవయవాలు చెడిపోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అవయవదానంతో ఆ రోగులకు పునర్జన్మ ఇచ్చినట్టు అవుతుంది. వారికి కొత్త జీవితాలు ఇచ్చినట్టు అవుతుంది. తాజాగా హైదరాబాద్ లో అలాంటి అద్భుతమే జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న ఓ రోగికి అమర్చేందుకు పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి పెద్ద సాహసమే చేశారు.
మలక్ పేట్ యశోద లో బ్రెయిన్ డెడ్ అయిన వీరబాబు గుండెను 12.30 నిమిషాలకు మలక్ పేట్ యశోద నుండి నిమ్స్ కి గుండె తరలింపు ప్రక్రియను హైదరాబాద్ ట్రాఫిక్ ను అంతా ఆపేసి పోలీసులు చేయడం ప్రశంసలు అందుకుంది.
కొండాపూర్ లో 8th బెటాలియన్ లో పోలీస్ కానిస్టేబుల్ గా వీరబాబు విధులు నిర్వహిస్తున్నాడు. ఖమ్మం లో రోడ్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. వీరబాబు వయసు 34 సంవత్సరాలు.ఈ క్రమంలోనే అవయవదానానికి కుటుంబ సభ్యులను ఒప్పించారు.
నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్ కి గుండె మార్పిడికి ఒప్పుకున్న వీరబాబు కుటుంబ సభ్యులు. దీంతో దీన్ని పోలీసుల సాయంతో వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.
11 కి. మీ లు 13నిమిషాలలో చేరుకున్న వీరబాబు గుండె. తుపాకుల హుస్సేన్ కి గుండె దానం చేశారు. పెంటర్ గా వర్క్ చేస్తున్న హుస్సేన్ కు పునర్జన్మ ప్రసాదించారు.
గుండె దానం చేసిన వీరబాబు కుటుంబ సభ్యులకు హుస్సేన్ ఫ్యామిలీ ధన్యవాదాలు తెలిపింది.