Hyderabad Gang Rape: హైదరాబాద్‌లో ఇటీవల పబ్బు–గబ్బు కల్చర్ బాగా పెరిగిపోయింది. ఓవైపు ఇంటర్నేషనల్ సిటీ, పెట్టుబడులకు స్వర్గధామం, నివాసానికి అద్భుతం, కంపెనీలకు వెల్కమ్ అంటూ.. అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నా.. మరోవైపు పబ్బుల్లో డ్రగ్స్ కలకలం పరువు తీసేలా ఉంది. తాజాగా అమ్నీషియా పబ్ దగ్గర ఓ మైనర్ బాలికపై కారులో గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఇది పొలిటిక్ టర్న్ తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ దీనిని అస్త్రంగా మలుచుకుంది.

ఎన్నికల అస్త్రంగా గ్యాంగ్ రేప్..
ఎప్పుడెప్పుడా అని కాచుక్కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఘటనను బాగా హైలెట్ చేస్తున్నాయి. నేరుగా కేసీఆర్‌ని టార్గెట్ చేస్తున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు దొరికిన ఈ అంశాన్ని పొలిటికల్ గా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ ఘటనపై బీజేపీ ఆల్రెడీ నేషనల్ మీడియాను దించేసింది.. తెలంగాణలో అరాచకం అనే కోణంలో గంటలు గంటలు వార్తలు, డిస్కషన్లు పెట్టిస్తోంది. అటు బీజేపీకి అనుకూలంగా తెలంగాణలో ఉన్న 2 తెలుగు చానెళ్లు కూడా దీన్ని హైలెట్ చేస్తున్నాయి.
Also Read: Chandrababu: టీడీపీ కొంపముంచుతున్న కోటరీ.. కట్టడి చేయలేకపోతున్న చంద్రబాబు
పోలీసుల తీరుతో ప్రభుత్వానికి మచ్చ…
విచిత్రం ఏంటంటే.. ఈ గ్యాంగ్ రేప్ జరిగింది మే 28. బాధితురాలి తండ్రి పోలీస్ కేసు పెట్టింది జూన్ 1న. కానీ ఈ విషయం హైలెట్ అయింది మాత్రం జూన్ 3న. మధ్యలో ఏం జరిగింది..? ఎవరిని ఈ కేసు నుంచి తప్పించాలనుకుంటున్నారు. గ్యాంగ్ రేప్ కోసం వాడిన కారుని ఎందుకు సీజ్ చేయలేదు, సీసీ టీవీ ఫుటేజ్ ని మీడియాకు ఎందుకు చూపించలేదు. ఇవన్నీ జవాబు దొరకని ప్రశ్నలే. మరోవైపు ఈ ఘటనలో నాయకుల పిల్లల ప్రమేయం లేదని, అనవసరంగా వారి భవిష్యత్తుని నాశనం చేయొద్దని పోలీసులు చెబుతున్నారు. కానీ జాప్యానికి కారణం మాత్రం చెప్పలేకపోవడంతో బీజేపీ రచ్చ చేస్తోంది. పోలీసుల తీరు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.

కేటీఆర్ ట్వీట్ చేస్తేనే స్పందన..
గ్యాంగ్ రేప్ జరిగి ఐదు రోజులు అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎఫ్‌ఐఆర్ కూడా మూడు రోజుల తర్వాత నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏదో జరుగుతుందని గ్రహించిన బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. ఇది బీజేపీకి మైలేజీ తెస్తుందని భావించిన వెంటనే కాంగ్రెస్ కూడా రంగప్రవేశం చేసింది. ఒకవైపు మీడియా.. మరోవైపు ప్రతిపక్షాల విమర్శలతో కేటీఆర్ డీజీపీకి ట్వీట్ చేశారు. బ్యాధులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పోలీసుల్లో చలనం వచ్చింది. ఐదు రోజులు గప్‌చుప్‌గా ఉన్న పోలీసులు కేటీఆర్ ట్వీట్‌తో హాడావుడి షురూ చేశారు. శుక్రవారం పొద్దుపోయాక హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీతో ప్రెస్‌మీట్ పెట్టించారు. చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటన చేయించారు. మొత్తంగా పొలిటికల్ టర్న్ తీసుకున్న గ్యాంగ్‌రేప్ ఘటన ఎవరికి మైలేజీ తెస్తుందోగానీ, బాధితురాలికి మాత్రం న్యాయం జరగాలి.
Also Read:Hyderabad Minor Girl Incident 28న రేప్.. 31న ఎఫ్ఐఆర్.. 3న అరెస్ట్.. ఏం జరుగుతోంది?
[…] […]
[…] […]