Hyderabad: కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్‌.. మోదీ కొత్త ఎత్తులో నిజమెంత!?

తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఏ సర్వే చూసినా బీజేపీకి అనుకూలంగా లేదు

Written By: Neelambaram, Updated On : September 19, 2023 6:07 pm
Follow us on

Hyderabad: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం(సెప్టెంబర్‌ 18న) ప్రారంభమయ్యాయి. తొలిరోజు పూర్తిగా పాత పార్లమెంటు భవనం గొప్పదనం. అందులో ఆమోదించిన బిల్లులు, చేసిన చట్టాలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా నేతలు ప్రసంగించారు. మోదీ ప్రసంగం ఇందులో హైలెట్‌గా నిలిచింది. దాదాపుగా తొలిరోజు పూర్తిగా 75 ఏళ్ల పాత పార్లమెంట్‌ భవనంపైనే సుదీర్ఘ చర్చ జరిగింది.

రెండో రోజు నుంచే కీలకం..
ఎవరూ ఊహించని విధంగా కేంద్రం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. ఐదు రోజుల సమావేశాల ద్వారా అనేక కీలక బిల్లులు ఆమోదించాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు, వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌తోపాటు పలు కీలక బిల్లులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం పాయంత్రం సుదీర్ఘంగా జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు బిల్లులపై ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో మంగళవారం నుంచి జరిగే సమావేశాలు కీలకం కానున్నాయి. మంగళవారం ఉదయం మొత్తం పాత పార్లమెంట్‌ భవన్‌లో ఫొటో సెషన్, నేతల ప్రసంగాలే ఉండనున్నాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత కొత్త భవనంలో సభ ప్రారంభం అవుతుంది. ఇందులో తొలి బిల్లు మహిళా రిజర్వేషన్‌ గురించి అని తెలుస్తోంది. అయితే ఈ బిల్లుతోపాటు తెలంగాణకు చెందిన మరో కీలక బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే బిలు.

యూటీగా ఎందుకు..?
కేంద్రం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని భావిస్తోందని తెలుస్తోంది. యూపీఏ హయాంలో కూడా ఈ ప్రతిపాదన చేశారు. అప్పుడు కేసీఆర్‌తోపాటు టీడీపీ అంగీకరించాయి. అయితే నాడు బీజేపీ మాత్రం దీనిని వ్యతిరేకించింది. తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని బీజేపీ నేతలు కిషన్‌రెడ్డితోపాటు పలురువు పట్టుపట్టారు. కేసీఆర్‌ మాత్రం హైరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించినా సమ్మతమే అని అంగీకరించారు. ఆంధ్రా, రాయల సీమ నేతలు కూడా కేంద్రాన్ని యూటీగా చేయడానికి సమ్మతించారు. బీజేపీ మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.

తెలంగాణలో అధికారంలోకి రావాలని..
తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఏ సర్వే చూసినా బీజేపీకి అనుకూలంగా లేదు. కేవలం 10 నుంచి 15 స్థానాలకు మించి రావని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు పట్టున్న హైదరాబాద్‌పై కేంద్రం దృష్టిసారించింది.

కేంద్రపాలిత ప్రాంతం చేస్తే..
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే బీజేపీకి కలిగే ప్రయోజనాలు ఇవే. భారతీయ జనతాపార్టీకి హైదరాబాద్‌లో పట్టు మరింత పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ విభజనతో అసంతృప్తిగా ఉన్న ఏపీ ప్రజలు, నేతలు సంతృప్తి చెందుతారు. ఆంధ్రాలో బీజేపీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటి వరకు ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా లేదు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి కూడా ఎంపీ సీట్లు పెరుగతాయని భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే బీజేపీ ఈ పార్లమెంటు సమావేశాల్లో హైదరాబాద్‌ యూటీ బిల్లు పెట్టే అవకాశం ఉంది.