Husband assaults wife: సంసారం అన్నాక బాధలు.. భార్య భర్త అన్నాక గొడవలు సహజం.. సర్ధుకుపోతే సంసారం కలకాలం నిలుస్తుంది.. పోకపోతే సమంత-నాగచైతన్యలాగా విడిపోతుంది. కొందరి విడాకులు ఇంత సాఫ్ట్ గా కావనుకోండి.. పోలీస్ స్టేషన్ గడపతొక్కడాలు.. చితకబాదడాలు.. దాడులు, తిట్లు శాపనార్థాలు అబ్బో ఆ భార్యాభర్తల లొల్లిలే వేరు..
సాధారణంగా భర్తలు ఆవేశంలో భార్యలను కొట్టేస్తారు. ఈ మధ్య భార్యలు కూడా భర్తలను కొడుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం.. అయితే ఎక్కువ ఇండ్లల్లో మాత్రం భార్యలను ఒక్కసారి అయినా కొట్టిన భర్తలు ఉంటారు. అది అత్యంత సహజమైన ప్రక్రియ.. భార్యభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయితే మాత్రం చిరిగి చాటవుతుంది. వాడి మూతే పగులుతుంది.
ఈ క్రమంలోనే అసలు భార్యభర్తల మధ్య గొడవలకు కారణం ఏంటి అనేది వారికి మాత్రమే తెలుస్తుంది. బయటకు అస్సలు చెప్పారు. కొన్ని శృంగారపరమైన సమస్యలు గొడవలకు దారితీస్తాయి..
Also Read: మీ భార్య మిమ్మల్ని పేరుతో పిలుస్తోందా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవలకు కారణాలపై జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ ఆ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా..పలు ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయంట.. భార్యను భర్త భర్త కొట్టడం తప్పు కాదా? అని అడిగిన ప్రశ్నకు ఎక్కువ శాతం మహిళలు అందులో తప్పేముంది? అని చెప్పడం గమనార్హం. ఇంతకీ భార్యను భర్తలు ఎందుకు కొడుతున్నారు అనేదానికి భర్తలు 7 కారణాలు చెప్పారంట.. ఆ కారణాలు ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఎక్కువ శాతం మంది భర్తలు చెప్పిన కారణం ఏంటో తెలుసా? ‘భార్య తమకు చెప్పకుండా బయటకు వెళ్లడం వలన కొట్టినట్లు’ చెప్పారు. ఆ తర్వాత భార్య చెప్పిన మాట వినకపోవడం.. పిల్లలను సరిగా చూసుకోకపోవడం..వంట సరిగ్గా చేయకోవడం.. శృంగారానికి తిరస్కరించడం, చీటికి మాటికి వాదనకు దిగడం.. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానం రావడం.. భర్త తరుఫు బంధువులను గౌరవించకపోవడం లాంటివి ఉన్నాయని సర్వే ద్వారా తెలిసింది.
ఈ సర్వే రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన భార్యభర్తలు పాల్గొన్నారు.
Also Read: టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పనితీరుతో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి..?