https://oktelugu.com/

వైసీపీకి భారీ బలం: ఇక తిరుగులేదు

చట్టసభల్లో బలం అంటే చాలా మంది రాష్ర్టంలో శాసనసభలోని ఎమ్మెల్యేలను కేంద్రంలో లోక్ సభలోని ఎంపీలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. అక్కడ నెగ్గితే అయిపోయినట్టే అనుకుంటారు. ప్రభుత్వం మనుగడ సాగించడం వరకు ఓకే గాని, బిల్లులు పాస్ కావాలంటే పెద్దల సభను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. రాష్ర్టంలో మండలి కేంద్రంలో రాజ్యసభలో బిల్లులు నెగ్గితేనే చట్టాలుగా మారుతాయి. ఈ విషయంలో బలం లేకే రాష్ర్టంలో అతికీలకమైన మూడు రాజధానుల బిల్లు వంటివి సైతం పెండింగులో పడిపోయాయి. ఈ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 18, 2021 / 07:31 PM IST
    Follow us on

    చట్టసభల్లో బలం అంటే చాలా మంది రాష్ర్టంలో శాసనసభలోని ఎమ్మెల్యేలను కేంద్రంలో లోక్ సభలోని ఎంపీలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. అక్కడ నెగ్గితే అయిపోయినట్టే అనుకుంటారు. ప్రభుత్వం మనుగడ సాగించడం వరకు ఓకే గాని, బిల్లులు పాస్ కావాలంటే పెద్దల సభను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందే.

    రాష్ర్టంలో మండలి కేంద్రంలో రాజ్యసభలో బిల్లులు నెగ్గితేనే చట్టాలుగా మారుతాయి. ఈ విషయంలో బలం లేకే రాష్ర్టంలో అతికీలకమైన మూడు రాజధానుల బిల్లు వంటివి సైతం పెండింగులో పడిపోయాయి. ఈ సమస్య నుంచి వైసీపీ బయటపడే సమయం వచ్చేసింది. నేటితో ఏపీ మండలిలో 8 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో టీడీపీకి చెందిన వారే ఏడుగురు ఉన్నారు. ఈ పరిణామంతో వైసీపీబలం 21కి పెరుగుతుండగా టీడీపీ బలం 15కు తగ్గిపోతోంది.

    మండలి విషయంలో ఇలాంటి సానుకూల పరిస్థితులు రాగా ఇటు రాజ్యసభలోనూ ఇదే విధమైన పరిస్థితి రాబోతోంది. వచ్చే జూన్ లో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో ఒకరు వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి కాగా మిగిలిన ముగ్గురు బీజేపీకి చెందిన సురేష్ ప్రభు, సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్ ఉన్నారు.

    ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైసీపీకి ఉన్న బలం దృష్ట్యా ఈ నాలుగు సీట్లు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. చూడటానికి ఈ సంఖ్య చూడడానికి చిన్న మొత్తంగానే కనిపించొచ్చు కానీ రాజ్యసభలో బీజేపీ పరిస్థితి దృష్ట్యా ఇది ఎంతో కీలకం కానుంది. రాజ్యసభలో బిబ్లు పాస్ కావాలంటే 123 మంది సభ్యుల మద్దు కావాలి. కానీ బీజేపీకి కేవలం 93 మంది సభ్యులే ఉన్నారు. మిగిలిన ముప్పై మంది సభ్యుల కోసం ఇతర పార్టీలపై ఆధారపడాల్సిందే.

    వచ్చే ఏడాది దాదాపు 70 మంది రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో బీజేపీ సభ్యులు కూడా చాలా మందే ఉన్నారు. తద్వారా బీజేపీ బలం మరింతగా పడిపోనుంది. వ్యవసాయ చట్టాల వంటివి వివాదాస్పదం కావడంతో పలు మిత్రపక్షాలు కూడా దూరం జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ మద్దతు చాలా కీలకంగా మారనుంది. అప్పుడు కేంద్రం జగన్ సర్కారుతో సానుకూలంా వ్యవహరించాల్సిన పరిస్థితులు అనివార్యంా వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.