https://oktelugu.com/

రఘునందన్ రావును టీఆర్ఎస్ అదును చూసి కొట్టిందా?

  దుబ్బాకలో రాజకీయం రగులుకుంటోంది. టీఆర్ఎస్ అక్కడ గెలిచేందుకు సామధాన భేద దండోపాయాలు వెతుకుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. టీఆర్ఎస్ తన గెలుపుకోసం అధికారాన్ని వినియోగిస్తున్నట్టు అర్థమవుతోంది. ప్రత్యర్థులను సీక్రెట్ లను.. లోపాయికారి సమాచారాన్ని పసిగడుతున్నట్టు తాజాగా అర్థమవుతోంది. Also Read: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త… ! ఈ క్రమంలోనే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రఘునందన్ రావు ఆయువు పట్టుపై తాజాగా టీఆర్ఎస్ కొట్టింది. తాజాగా రఘునందన్ రావుకు చెందినిదిగా అనుమానిస్తున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : October 7, 2020 / 10:15 AM IST
    Follow us on

     

    దుబ్బాకలో రాజకీయం రగులుకుంటోంది. టీఆర్ఎస్ అక్కడ గెలిచేందుకు సామధాన భేద దండోపాయాలు వెతుకుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. టీఆర్ఎస్ తన గెలుపుకోసం అధికారాన్ని వినియోగిస్తున్నట్టు అర్థమవుతోంది. ప్రత్యర్థులను సీక్రెట్ లను.. లోపాయికారి సమాచారాన్ని పసిగడుతున్నట్టు తాజాగా అర్థమవుతోంది.

    Also Read: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త… !

    ఈ క్రమంలోనే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రఘునందన్ రావు ఆయువు పట్టుపై తాజాగా టీఆర్ఎస్ కొట్టింది. తాజాగా రఘునందన్ రావుకు చెందినిదిగా అనుమానిస్తున్న రూ.40 లక్షల నగదును పోలీసులు పట్టుకోవడం.. అది ఆయనదేనని నిరూపించడం కలకలం రేపుతోంది.

    తాజాగా 40 లక్షల రూపాయలతో దుబ్బాక వెళ్తున్న కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగర పోలీసులకు అందిన సమాచారం ప్రకారం..మంగళవారం రాత్రి శామీర్ పేటలో రూ.40 లక్షల అక్రమ డబ్బుతో కొంతమంది వ్యక్తులు పట్టుబడడం కలకలం రేపింది. పోలీసులకు చిక్కిన నలుగురు వ్యక్తులను డీసీపీ పద్మజ విచారించారు. ఆ డబ్బును రఘునందన్ రావుకు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్టు వాళ్లు తెలిపినట్లు డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు. పటాన్ చెరు నుంచి సిద్దిపేటకు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నామని డీసీపీ పద్మజ పేర్కొన్నారు. నిందితులతో రఘునందన్ రావు పీఏ సంతోష్ ఫోన్ సంభాషణను గుర్తించామని ఆమె వెల్లడించారు.

    ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు తరలిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఊపు మీద ఉండగా.. ఇంత మొత్తంలో డబ్బు పట్టుబడడం కలకలం రేపుతోంది.

    Also Read: ఏకశిలా నగరిపై ఎగిరేది ఎవరి జెండా?

    కాగా ఈ డబ్బు పట్టుబడడంపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అధికారికంగా స్పందించలేదు. ఈ పరిణామంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆ పార్టీ నేత రఘునందన్ రావు వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తమవుతున్న వేళ ఆయన ఇరకాటంలో పడ్డారు.