AP Employees: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాలు ఎలా తగ్గుతాయి..? ఆ వివరాలేంటి..?

AP Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కారు. గత నెలన్నర రోజులుగా వారు ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు. అయితే అంతకుముందు పీఆర్సీ ప్రకటించాలని ఆందోళన చేస్తే.. ఇప్పుడు కొత్త పీఆర్సీ వద్దంటూ ఉద్యమాలు చేస్తున్నారు. తమకు పాత జీతమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉద్యోగులను ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా ఫిబ్రవరి 1 నుంచి కొత్త జీతాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ట్రెజరీ శాఖపై ఒత్తిడి తెస్తోంది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ […]

Written By: NARESH, Updated On : January 30, 2022 12:01 pm
Follow us on

AP Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కారు. గత నెలన్నర రోజులుగా వారు ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు. అయితే అంతకుముందు పీఆర్సీ ప్రకటించాలని ఆందోళన చేస్తే.. ఇప్పుడు కొత్త పీఆర్సీ వద్దంటూ ఉద్యమాలు చేస్తున్నారు. తమకు పాత జీతమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉద్యోగులను ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా ఫిబ్రవరి 1 నుంచి కొత్త జీతాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ట్రెజరీ శాఖపై ఒత్తిడి తెస్తోంది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ ను పట్టించుకోనట్లు తెలుస్తోంది. పెన్షనర్లకు ఇచ్చే సీసీఏలో చాలా వరకు కోత విధించనున్నారు. పలు రకాల కారణాలతో కోత విధించడంతో వారికి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ap-govt

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఐదేళ్లకోసరి సవరణ చేస్తారు. దీనినే పే రివిజన్ కమిటీ (పీఆర్సీ) అంటారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా వారి జీతాలను సవరించి పెంచుతూ ఉంటారు. పీఆర్సీ ప్రతిపాదనల్లో బేసిక్ పే, ఫిట్మెంట్, డీఏ, హెచ్ఆర్ఏ, ఐఆర్ వంటివి ఉంటాయి. ఉద్యోగంలో చేరిన వెంటనే ఒక ఉద్యోగికి ఎలంటి అలవెన్స్ లు లేకుండా తప్పనిసరిగా ఇవ్వాల్సిన వేతనాన్ని బేసిక్ పే (మూలవేతనం) చెల్లిస్తారు. ఇది 30 నుంచి 60 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మూలవేతనంతో పాటు డీఏను కూడా పెరిగిన వేతనానికి అనుగుణంగా చెల్లిస్తారు. ఏడాదిలో జనవరి, జూలైలో దీనిని ప్రకటిస్తారు. అయితే డీఏ ను ఉద్యోగులకు ప్రకటంచిన వెంటనే చెల్లించకుండా ఆర్థిక వెసులుబాటును భట్టి చెల్లిస్తారు.

వీటితో పాటు హెచ్ఆర్ఏ కూడా ఉద్యోగులకు లభిస్తుంది. ఒక ఉద్యోగి నివసిస్తున్న ప్రాంతాన్నిపరిగణలోకి తీసుకొని హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. దీనిని ఆదాయపు పన్ను కింద మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. పీఆర్సీలో ప్రధానమైనది ఫిట్మెంట్. ఒక ఉద్యోగి జీతంలో మూలవేతనం ఇదే. దీనిని ఐదేళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు లభించే మరోకొటి ఐఆర్.. పీఆర్సీ కమిటీ ఆలస్యానికి ప్రతిఫలంగా మధ్యంతర భృతి కింద కొంత మొత్తాన్ని చెల్లిస్తారు.

ఏపీ ప్రభుత్వం 2018 నాటి పీఆర్సీ అమలులో భాగంగా 27 శాతం ఐఆర్ నిర్ణయించింది. కాగా ఈనెల 17న ప్రకటించిన పీఆర్సీలో దీనిని 23.29శాతంగా తగ్గించింది. దీంతో ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా కనిపిస్తోంది. దీంతో ఉద్యోగులు తీసుకునే జీతాల్లో 3.71 శాతం వేతనం తగ్గుతుందని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు హెచ్ ఆర్ లను కూడా ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటి వరకు 20 శాతం ఉన్నవారికి 16 శాతం…14.5 శాతం ఉన్న వారికి 8 శాతం…12 శాతం ఉన్న వారికి 8 శాతంగా తగ్గించారు. అంటే అంతకుముందు ప్రాంతాలను భట్టి హెచ్ ఆర్ ఇవ్వగా.. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చూపుతూ లెక్కగడుతున్నారు. దీంతో శ్రీకాకుళం, విజయనగరం సిటీల్లో చేసినా అక్కడి జనాభాను భట్టి చూస్తే 8 శాతం హెచ్ ఆర్ తగ్గే అవకాశం ఉంది.

5 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో హెచ్ఆర్ ను 16 శాతంగా.. మిగతా చోట్ల 8 శాతంగా చెల్లించాలని సిఫార్సు చేశారు. దీతో రాష్ట్రంలోని 80 శాతం ఉద్యోగలు హెచ్ఆర్ఏను 6 శాతం వరకు నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో జీతంలో కోత పడుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా పెన్షనర్లకు భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సీసీఏ పేరుతో సిటీలో ఉండే వారికి కరవు భత్యం, మెడికల్ ఖర్చులు చెల్లిస్తారు. అయితే కొత్త పీఆర్సీలో దీని ప్రస్తావన లేదు. వాస్తవానికి 70 ఏళ్లకు చేరుకున్నవారి నుంచి 10, 15, 20 శాతం పెంచుకుంటూ పోవాలి. కానీ 80 ఏళ్లకే ఒకేసారి 20 శాతం పెంచుతామని తెలిపారు. అంతేకాకుండా గ్రాడ్యూటీని రూ.16 లక్షలకే పరిమితం చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఉద్యోగ సంఘాల ఆందోలన నేపథ్యంలో ఫిబ్రవరి 1 లోగా ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. కానీ మేం కూడా ప్రభుత్వ ఉద్యోగులమే..దయచేసి ఈ విషయంలో ఒత్తిడి తేవద్దని వారు అంటున్నారు.