2021 Round up Jagan : 2021 రౌండప్: జగన్.. ఈ ఏడాది మాట తప్పా.. మడమ తిప్పాడు.. విసిగించాడు

డుJagan rule in 2021: ఎన్నో ఆశలు, ఆకాంక్షలు మోసుకుంటూ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. 3వేల కి.మీల పాతయాత్ర చేసి ప్రజాభిమానం చూరగొని ఏపీకి సీఎం అయ్యారు. తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తోంది. 2021 సంవత్సరం మొత్తం జగన్ క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. ప్రజల్లోకి ఈ ఏడాది జగన్ వెళ్లింది లేదనే చెప్పాలి. దీనికి కరోనా వైరస్ ప్రధాన కారణంగా చెప్పాలి. వైరస్ వ్యాప్తితో జగన్ క్యాంపు […]

Written By: NARESH, Updated On : December 31, 2021 8:32 pm
Follow us on

డుJagan rule in 2021: ఎన్నో ఆశలు, ఆకాంక్షలు మోసుకుంటూ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. 3వేల కి.మీల పాతయాత్ర చేసి ప్రజాభిమానం చూరగొని ఏపీకి సీఎం అయ్యారు. తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తోంది. 2021 సంవత్సరం మొత్తం జగన్ క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. ప్రజల్లోకి ఈ ఏడాది జగన్ వెళ్లింది లేదనే చెప్పాలి. దీనికి కరోనా వైరస్ ప్రధాన కారణంగా చెప్పాలి. వైరస్ వ్యాప్తితో జగన్ క్యాంపు కార్యాలయంలోనే ఉండి ఏపీ పాలన సాగించారు. ఈ సంవత్సరం జగన్ కు ఏం మిగిల్చిందనే దానిపై స్పెషల్ ఫోకస్..

Jagan Rule

-అచ్చిరాని 2021
ఓవరాల్ గా 2021 సంవత్సరం జగన్ కు అచ్చిరాలేదనే చెప్పాలి. రాజకీయంగా కలిసి వచ్చినా పాలన పరంగా జగన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా మూడు రాజధానులను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని.. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే అమరావతి రైతులు సహా ప్రతిపక్షాలు హైకోర్టుకెక్కడంతో ప్రక్రియ మూడు రాజధానులపై స్టే వచ్చింది. అయితే ఇటీవల మూడురాజధానులు, సీఆర్డీఏ బిల్లులు వెనక్కి తీసుకొని జగన్ షాక్ ఇచ్చారు. కోర్టుల్లో తేలకపోవడంతోనే జగన్ ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారని..మళ్లీ వాటిని ప్రవేశపెడుతానని అన్నారు. కానీ ఈ నిర్ణయం జగన్ విశ్వసనీయతను, పాలన వైఫల్యాన్ని ఎత్తిచూపించినట్టైంది. జగన్ నిర్ణయాలలో అతిపెద్దదాన్ని వెనక్కి తీసుకోవడం గమనార్హం.

-శాసనమండలిని వెనక్కి తీసుకొని అభాసుపాలు
శాసనమండలిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన జగన్ తిరిగి దాన్ని వెనక్కి తీసుకొని అభాసుపాలయ్యారు. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ తీరు ఇక్కడ బూమరాంగ్ అయ్యింది.

-మద్యం ధరలు తగ్గించి పీచేముడ్
ఇక మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న మద్యం ధరలను తగ్గించి జగన్ కాస్త కరుణించారు.కానీ ఈ ధరలతో తెచ్చుకున్న వ్యతిరేకతను మాత్రం తగ్గించుకోలేకపోయారు. చీప్ మద్యంతో ఇప్పటికీ మందుబాబులు ఆగ్రహంగానే ఉన్నారు. మద్య నిషేధం కోసమే ధరలు పెంచుతున్నామన్న జగన్.. దాన్ని కూడా వెనక్కి తీసుకుంది. మధ్యం ధరల విషయంలో ఏపీ ప్రజల్లోనూ జగన్ సర్కార్ తీరుపై ఆగ్రహ జ్వాలలు ఉన్నాయి. సంక్షేమంతో ఇస్తూ మద్యం ధరలతో తమ నుంచి ఆ డబ్బు తీసుకుంటున్నాడన్న అపవాదును జగన్ మూటకట్టుకున్నాడు.

-చంద్రబాబును ఏడిపించిన జగన్
వైఎస్ఆర్, కేసీఆర్ సహా ఎంతో మంది రాజకీయంగా పండిన నేతలను ఎదుర్కొని నిలిచిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును సైతం తన రాజకీయంతో కంటతడి పెట్టించి మీడియా ముందు బోరున ఏడ్చేలా చేసిన ఘనత జగన్ దే అని చెప్పొచ్చు.కారణాలేవైనా సరే చంద్రబాబు లాంటి ఉద్దండ పిండాన్ని రాజకీయంగా ఇంతలా దిగజార్చి టీడీపీ శ్రేణుల్లో సైతం అపనమ్మకం కలిగేలా చేసిన ఘనత మాత్రం జగన్ దేనని చెప్పొచ్చు.

-వరుస ఎన్నికల విజయాలతో ఊపు.. వార్ వన్ సైడ్..
అయితే కొంచెం మోదం కూడా జగన్ కు లభించింది. ఈ ఏడాది జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాలకు అస్సలు ఛాన్స్ లేకుండా చేసింది. స్వయంగా చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ స్థానికసంస్థల్లో ఓడించింది. పంచాయతీ, మున్సిపాలిటి, పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటింది. వన్ సైడ్ వార్ గా రాజకీయాలను ఏలింది.

-కోర్టులు, వ్యవస్థలతో జగన్ కు షాక్
పాలన పరంగా ఎంత దూకుడుగా ముందుకెళుతున్నా కూడా వైఎస్ఆర్సీ అధినేతకు ఈ విజయాలు అంత తేలిగ్గా రాలేదు. పాలనకు మోకాలడ్డుతూ.. ముందరి కాళ్లకు బంధం వేసేలా సాగింది. కోర్టులు మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం వంటి ఇతర రాజ్యాంగ సంస్థలను ఎదుర్కోవలసి వచ్చింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకూ జగన్ ఘర్షణ పడ్డారు. కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి.

-వివాదాస్పద నిర్ణయాలు
అమరరాజా బ్యాటరీల మూసివేత, ధూళిపాళ్ల నరేంద్ర యాజమాన్యంలోని సంగెం డెయిరీని స్వాధీనం చేసుకోవడం, మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ ఛైర్మన్‌గా సీనియర్ టీడీపీ నాయకుడు అశోక్ గజపతి రాజు తొలగింపు మొదలైన అనేక ఇతర సమస్యలలో కూడా జగన్ ప్రభుత్వం న్యాయపరమైన ఎదురుదెబ్బలను ఎదుర్కొంది.

-రాజకీయ ప్రత్యర్థులను వేటాడిన జగన్
ఈ ఏడాది కాలంలో వైఎస్‌ఆర్‌సి ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను వేటాడిందన్న ఆరోపణలను కూడా ఎదుర్కొంది. అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో నయీంను ఇరికించే ప్రయత్నం చేసిన ప్రభుత్వం న్యాయపరమైన అడ్డంకులను దాటలేకపోయింది.

– జగన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ కె. రఘురామరాజు నిలిచారు. రాజకీయ వేటలో అత్యంత హైలైట్ అయిన సంఘటనగా మిగిలారు. రఘురామను అరెస్ట్ చేసి కోర్టుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ సైతం రఘురామను ఎదుర్కోలేక పిల్లిమొగ్గలు వేశారు.

-సిబిఐ విచారణలో జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి సన్నిహితుల పేర్లు చార్జిషీట్‌లో ఉండడంతో జగన్ ప్రభుత్వానికి పెద్ద చిక్కు వచ్చి పడింది.

-జగన్ ప్రభుత్వానికి అప్పులు గుదిబండగా మారాయి.. రాష్ట్ర ప్రభుత్వం విచక్షణారహితంగా రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. సంక్షేమ పథకాల కోసం డబ్బును అందించడానికి వివిధ శాఖలు మరియు పంచాయతీ రాజ్ సంస్థల నుండి కూడా నిధులను మళ్లించాల్సి వచ్చింది.కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తగ్గుతున్న ఆదాయాల వల్ల ప్రభావితమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది, తద్వారా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మరింత ఎక్కువ రుణాలు తీసుకోవడానికి కేంద్రం నుండి అనుమతి పొందడానికి ప్రతిసారీ ఢిల్లీకి పరుగెత్తవలసి వచ్చింది.

-అమరావతి రాజధాని రైతుల తిరుపతి వరకూ పాదయాత్ర జగన్ ను ఇబ్బందిపెట్టింది. బీజేపీ దీనికి మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొని ఉద్యమాన్ని ఉరకలెత్తింది.

-విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా ఆ సంస్థ కార్మికులు చేస్తున్న ఆందోళన కూడా ఏడాది కాలంలో ఏపీలో పెను పరిణామం. బీజేపీ మినహా వైఎస్సార్‌సీపీ సహా అన్ని పార్టీలు వారికి మద్దతు పలికాయి.

-టాలీవుడ్ టికెట్ రేట్ల విషయంలో జగన్ సర్కార్ తీరుకు సినీ పెద్దల నుంచి వ్యతిరేకత పెల్లుబికింది. ఇప్పటికీ సీనీ హీరోలతో కయ్యం పెట్టుకొని జగన్ సర్కార్ కయ్యానికి కాలుదువ్వుతోంది. చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్న వెనక్కి తగ్గడం లేదు.

2021 రాజకీయంగా ఫరవాలేకున్నా.. పాలనాపరంగానే జగన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. జగన్ కు 2021 రివర్స్ డెసిషన్ ఇయర్ గా మిగిలిందని చెప్పొచ్చు.