https://oktelugu.com/

కేసీఆర్ ప్రకటించిన రూ 1500 నగదు అందక గగ్గోలు

లాక్ డౌన్ కారణంగా ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి నెలకు రూ 1,500 చొప్పున నగదు అందిస్తామని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు ప్రకటించినా చాలామంది ఇంకా అందక గగ్గోలు పడుతున్నారు. ఆ మొత్తం బ్యాంకు ఖాతాలలో క్రెడిట్ కాకా, పోస్ట్ ఆఫీస్ లోను ఇవ్వక ఎవ్వరిని అడగాలో దిక్కు తోచక చూస్తున్నారు. పలువురికి రెండు విధాతలుగా కూడా ఈ మొత్తం అందలేదని చెబుతున్నారు. చాలామందికి అందవ్వక జనం ఆర్డీఓ, చీఫ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 16, 2020 / 12:52 PM IST
    Follow us on

    లాక్ డౌన్ కారణంగా ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి నెలకు రూ 1,500 చొప్పున నగదు అందిస్తామని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు ప్రకటించినా చాలామంది ఇంకా అందక గగ్గోలు పడుతున్నారు. ఆ మొత్తం బ్యాంకు ఖాతాలలో క్రెడిట్ కాకా, పోస్ట్ ఆఫీస్ లోను ఇవ్వక ఎవ్వరిని అడగాలో దిక్కు తోచక చూస్తున్నారు. పలువురికి రెండు విధాతలుగా కూడా ఈ మొత్తం అందలేదని చెబుతున్నారు.

    చాలామందికి అందవ్వక జనం ఆర్డీఓ, చీఫ్ రేషనింగ్, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కరోనా విధులలో తీరికలేకుండా ఉన్న సిబ్బంది నుండి సారైనా సమాధానం లభించడం లేదు. హైదరాబాద్ జిల్లాలోని 674 రేషన్ షాపుల పరిధిలో 5,80,747 తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఆ లబ్ధిదారుల్లో చాలామంది ప్రభుత్వం ఇస్తానన్న రూ.1500 ఇంకా అందలేదని వాపోతున్నారు.

    లబ్ధిదారుల్లో కొద్దిమందికి బియ్యం వచ్చినా నగదు అందలేదు. మరికొందరికి రెండూ అందలేదు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు సివిల్ సప్లయ్ సర్కిల్ ఆఫీసులకు నిత్యం వందల మంది వస్తున్నారు. అధికారులు వారి వివరాలు తీసుకుని కమిషనర్ ఆఫీసుకు పంపి ఉరుకొంటున్నారు.

    ప్రభుత్వం ప్రకటించిన సాయం అందని పక్షంలో టోల్ ఫ్రీ 1967, లేదా 040–23324614, 040–-23324615 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వం చెప్పినా అవి కూడా పనిచేయడం లేదని జనం వాపోతున్నారు. రేషన్ కార్డు కోసం జనతా కర్ఫ్యూకు ముందు దాదాపు 70 వేల మంది దరఖాస్తు చేసుకోగా, అవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి.

    కాగా, పలువురికి బ్యాంక్ అకౌంట్‌‌‌‌కు ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోతే డబ్బులు రావడం లేదని సివిల్ సప్లయ్ అధికారులు చెప్తున్నారు. అలాంటి వారు వెంటనే జత చేసుకోవాలని సూచిస్తున్నారు. కార్డ్ హోల్డర్ చనిపోయి ఉన్నా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఏఎస్ఓ, సీఆర్ఓలకు వచ్చి మార్పులు చేసుకోవచ్చని సూచించారు.