https://oktelugu.com/

KA Paul: డబ్బులిచ్చి మరీ తెలుగు న్యూస్ చానల్స్ లో కేఏ పాల్ ప్రమోషన్ అందుకోసమేనట?

KA Paul: కేఏ పాల్.. నడి ఎండల్లో.. అదీ మే నెలలో సీరియస్ పాలిటిక్స్ లో కూడా కామెడీ పండించి మనల్ని అందరినీ నవ్వించిన ఏకైక రాజకీయ నాయకుడు.. పాల్ ఎంత సీరియస్ గా మాట్లాడినా.. జనాలు అంతగా నవ్వుకున్నారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఓడించాలని టీడీపీ బ్యాచ్ వేయని ప్లాన్లులేవు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన జగన్ ను దెబ్బతీయడానికి అదే క్రైస్తవ సువార్తకుడు.. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ను […]

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2021 4:20 pm
    Follow us on

    KA Paul: కేఏ పాల్.. నడి ఎండల్లో.. అదీ మే నెలలో సీరియస్ పాలిటిక్స్ లో కూడా కామెడీ పండించి మనల్ని అందరినీ నవ్వించిన ఏకైక రాజకీయ నాయకుడు.. పాల్ ఎంత సీరియస్ గా మాట్లాడినా.. జనాలు అంతగా నవ్వుకున్నారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఓడించాలని టీడీపీ బ్యాచ్ వేయని ప్లాన్లులేవు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన జగన్ ను దెబ్బతీయడానికి అదే క్రైస్తవ సువార్తకుడు.. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ను ఏపీ రాజకీయాల్లోకి దించారన్న ఆరోపణలు వచ్చాయి.. క్రైస్తవ ఓట్లను.. చివరకు ఫ్యాన్ ను పోలిన గుర్తును పొందిన కేఏ పాల్.. వైసీపీని ఎంత ఇబ్బంది పెట్టాడో అందరూ చూశారు. జగన్ ను ఎలాగైనా ఓడించాలనే అమెరికాలో ఉన్న కేఏ పాల్ ను దించారన్న టాక్ నడిచింది.

    KA Paul

    KA Paul

    అయితే ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో కామెడీ చేసినా జనాలు మాత్రం జగన్ నే గెలిపించారు.. అలా ఇలా కాదు.. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలను ఇచ్చారు. దీంతో పెట్టాబేడా సర్దుకొని కేఏ పాల్ అమెరికా వెళ్లిపోయారు.

    ఈ రెండేళ్లలో అప్పడప్పుడూ ఆరునెలలకోసారి సందడి చేసి గమ్మున ఉన్నాడు. కానీ ఇప్పుడు సడెన్ గా యాక్టివ్ అయ్యాడు. ఏకంగా టీడీపీ అనుకూల న్యూస్ చానెల్స్ ప్రైమ్ టైంను గంట సేపు కొనుగోలు చేసి మరీ లైవ్ నిర్వహించాడని జర్నలిస్ట్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. నిన్న ఒక చానెల్ లో గంట టైంను కొనేసి లైవ్ లోకి వచ్చిన పాల్ ఇప్పుడు తెలుగు న్యూస్ చానెల్స్ లోని టాప్ 3లకు కూడా డబ్బులిచ్చి సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య ప్రైమ్ టైంను కొనేశాడని.. వరుసగా వాటిల్లోనూ పాల్ ఇంటర్వ్యూ వస్తుందని సమాచారం.

    నిన్న రాత్రి అమెరికాలో ఉన్న కేఏపాల్ తో గంట పాటు జరిగిన చర్చలో విరామం లేకుండా ప్రత్యేకంగా ప్రసంగించాడు. ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడారు. పాల్ ను ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు లాగి మరీ జగన్ మోహన్ రెడ్డిపై వ్యతిరేకంగా మాట్లాడించారు. అసలు దీనివెనుక మతలబు ఏంటని ఆరాతీయగా ఆసక్తికర విషయాలు తెలిసివచ్చాయి.

    కేఏ పాల్ భారీ మొత్తాన్ని చెల్లించి టీడీపీ అనుకూల న్యూస్ చానెల్ లో గంట సమయాన్ని కొన్నాడట.. ఈరోజు మరో న్యూస్ చానెల్ లోనూ గంట పాటు చర్చ సమయాన్ని కొన్నాడని టాక్.. ఇక తెలుగు టాప్ 3 న్యూస్ చానెల్స్ లో కూడా ప్రైమ్ టైంను గంట పాటు కొన్నాడని తెలుస్తోంది. ఈ అన్ని న్యూస్ చానెల్స్ కొన్ని రోజుల్లో కేఏ పాల్ ప్రత్యక్ష ప్రసారాలు చేయబోతున్నారట..

    Also Read: రేవంత్ సీరియస్ గా తీసుకుంటేనే ఛాన్స్.. లేదంటే?

    ఈ న్యూస్ చానెల్స్ కేఏపాల్ తో నిధులు పొందుతున్నాయి. అలాగే పాల్ కావాల్సిన పబ్లిసిటీ దక్కుతోంది. అలాగే తమ ప్రత్యర్థి అయిన జగన్ ను ఓడించడానికి.. వైసీపీకి వ్యతిరేకంగా క్రైస్తవ వర్గాలను ప్రభావితం చేయడానికి కేఏ పాల్ ఉపయోగపడుతున్నాడు.అందుకే టీడీపీ కూడా దీనికి సపోర్టుగా నిలిచి పాల్ కోసం ప్రమోషన్ ను నిర్వహించాలని తమ అనుకూల చానెల్స్ కు సూచించిందన్నది ఇన్ సైడ్ టాక్.

    అటు డబ్బుకు డబ్బు.. జగన్ పై విమర్శలు.. ఇటు టీడీపీకి ప్లస్ కావడంతో ఈ చానెల్స్ అన్నీ కేఏ పాల్ తో డిబేట్లు నిర్వహించడానికి ఓకే అన్నాయని తెలిసింది. ఇలా కేఏ పాల్ గంట పాటు టీవీల్లో ప్రత్యక్షం కావడం వెనుక అసలు కథ ఇదీ అన్నట్టు.

    Also Read: 2021 పొలిటికల్ రౌండప్: ఈ ఏడాది దేశంలో జరిగిన అతిపెద్ద ఘటనలివీ