https://oktelugu.com/

Udaipur Murder : ఉదయ్ పూర్ నిందితులను ఇలా పట్టుకున్నారు.. వైరల్ వీడియో లీక్

Udaipur Murder దేశంలో ఇప్పుడు ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి తలలు తెగిపోతాయంటూ వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. బీజేపీ బహిష్కృత నేత నుపూర్ శర్మ అప్పట్లో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారం రేపాయి. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. గల్ఫ్ దేశాలు సైతం ఖండించాయి. ఇక నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన కన్హయ్య […]

Written By:
  • NARESH
  • , Updated On : June 30, 2022 / 10:44 AM IST
    Follow us on

    Udaipur Murder దేశంలో ఇప్పుడు ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి తలలు తెగిపోతాయంటూ వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. బీజేపీ బహిష్కృత నేత నుపూర్ శర్మ అప్పట్లో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారం రేపాయి. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. గల్ఫ్ దేశాలు సైతం ఖండించాయి.

    ఇక నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన కన్హయ్య లాల్ అనే వ్యక్తి వాట్సాప్ లో నుపూర్ ఫొటోను స్టేటస్ గా పెట్టుకున్నాడు. ఇది చూసి ఆగ్రహానికి గురైన ప్రత్యర్థి వర్గం కన్హయ్య లాల్ ను అతికిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ఇక స్వరభాస్కర్ కు సైతం తాజాగా చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచినా.. లేదా సపోర్టు చేసినా ప్రత్యర్థి వర్గాలు అస్సలు ఉపేక్షించడం లేదు. ఇలా హత్యలకు తెరతీస్తున్నారు. తలనరికేస్తూ కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు.

    తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భయపడిపోయింది. ఉదయ్ పూర్ లో నుపూర్ శర్మకు మద్దతుగా నిలిచిన కన్హయ్య లాల్ తల నరికి జిహాదీలు వీడియో తీశారు. దేవుడి పేరుతో ఉదయ్ పూర్ లో కన్హయ్య తల నరికి చంపారు. ఆ దారుణమైన వీడియోలు చూసే ధైర్యం నాకు లేదు.. నేను మొద్దుబారిపోయాను’ అంటూ కంగనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

    ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ ను చంపడమే కాకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో జిహాదీలు వైరల్ చేశారు. ఈ దారుణ హత్యాకాండను చూసి అందరూ విస్తుపోతున్న పరిస్థితి నెలకొంది.

    ఇక కన్హయ్యలాల్ ను చంపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఆ వీడియోను కొందరు తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయ్యింది.