4 Government Jobs: ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు ఉద్యోగాలు సంపాదించిన ఓ యువతి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం దక్కితేనే పొంగిపోయే నేటి రోజుల్లో ఆమె నాలుగు ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆడపిల్ల పుట్టడమే అనర్థమని చెబుతున్న సందర్భంలో ఆమె అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగమంటే అదేదో కొట్టిన పిండిలా నాలుగు ఉద్యోగాలు సంపాదించడం ఓ గర్వకారణమే.

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలోని సీటీఎం పంచాయతీ పరిధిలోని మిట్టపల్లికి చెందిన రమణ, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి అమ్మాయి శిరీష. ఎప్పుడు చదువులో ముందుండేది. దీంతో ఆమె ఎంటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఏపీపీఎస్పీ నిర్వహించిన పరీక్షలో ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించి అందరిని ఆశ్చర్యపరచింది.
Also Read: భీమ్లానాయక్‌కు పెంచిన రేట్లు వర్తించవా.. జగన్ ప్లాన్ ఇదేనా..?
ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్విరాన్ మెంటల్ విభాగంలో ఏఈగా పని చేస్తోంది. 2017లో ఏపీపీఎస్పీ విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అన్ని పరీక్షలకు దరఖాస్తు చేసింది. దీంతో ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో జరిగిన పరీక్షల్లో గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్, డిస్ట్రిక్ట్ హైడ్రాలజిస్ట్ ఎన్విరాన్ మెంటల్ విభాగాల్లో ఏఈ పోస్టులు, జెన్ కో లో ఏఈ పోస్టులకు గాను నాలుగు ఉద్యోగాలకు ఎంపికైంది.
2018లో జరిగిన గ్రూప్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ కు అర్హత సాధించింది. ఇలా ఉద్యోగాల సాధనలో శిరీష చూపిన అసమాన ప్రతిభకు అందరు అవాక్కవుతున్నారు. వరుసగా ఉద్యోగాలు సాధించడం చూసి గర్వపడుతున్నారు. కడప గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ లో కూడా నెల పాటు ఉద్యోగం చేసినా సొంతూరుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఆమె మళ్లీ చిత్తూరు జిల్లాలో ఉద్యోగం చేస్తోంది.
Also Read: ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకునే పనిలో జగన్.. పెద్ద ప్లానే వేశారే..!