YCP: టీవీ5 చానల్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ తాజాగా ప్రకటించింది. అయితే, ఒకప్పుడు టీవీ 5 వైసీపీకి సపోర్ట్ చానల్‌గా ఉండేది. అలా అప్పట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయమైన మీడియా సంస్థగా ఉండే టీవీ5 ఇప్పుడు వ్యతిరేక చానల్ అయిపోయింది.

అప్పట్లో వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో రిలయన్స్ ప్రమేయం పాత్ర ఉందనే, అలా రిలయన్స్ ఆస్తులపై దాడు చేయించాలనే కథనాన్ని ప్రసారం చేయించాలనే ప్లాన్ చేసిందట. అలా ఆ ప్లాన్ అమలు చేయడంలో టీవీ 5 కీలక పాత్ర పోషించిందని వార్తలున్నాయి. అలా అది ఫేక్ వార్త అని తెలిసినప్పటికీ ఊరు, పేరు లేని ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తను బ్రేకింగ్ వేసి ఇప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్న వెంకటకృష్ణతో షో నడిపించారు.
ఈ షోలో కథనం ప్రసారం అయిన క్రమంలో జగన్‌కు మద్దతుగా ఉన్న మీడియా ఆ కథనాన్ని ప్రసారం చేయడంలో ముందుకు వచ్చి మరీ అందుకున్నాయి. ఆ క్రమంలోనే దాడులు కూడా జరిగాయి. ఇక అప్పట్లో వైసీపీ అధినేత జగన్‌కు టీవీ5లో వచ్చినంత కవరేజీ ఏ చానల్‌లో రాకపోయేది. అలా టీవీ 5 జగన్ మద్దతు చానల్‌గా ఉండింది. ఇకపోతే టీవీ5కి సైడ్ బిజినెస్‌గా నూజెన్ ఆయిల్ అమ్మేవారు. ఆ ఆయిల్ బాగా పాపులర్ అయింది. అలా వ్యాపారం కూడా బాగానే జరిగింది. ఇదిలా ఉండగానే ఏమైందో ఏమో తెలియదు కానీ, హఠాత్తుగా టీవీ 5 వైసీపీకి వ్యతిరేకం అయిపోయింది.
Also Read: CM Jagan: అంతులేని అభిమానం.. సీఎం జగన్‌కు బంగారు పుష్పాలతో అభిషేకం.. ఎక్కడంటే!
వైసీపీకి వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేయడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే చానల్ ను భయపెట్టేందుకు వైసీపీ వారు కేసులు కూడా పెట్టారు. అలా భయపెట్టి చానల్ ను తమ కంట్రోల్‌లోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ, అలా సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో టీవీ 5 మరింతగా రెచ్చిపోయింది. అయితే, ఎన్టీవీ మాత్రం తన స్టాండ్‌ను అలానే ఉంచేసుకుంది. ఒకప్పటిలాగానే టీడీపీపై వ్యతిరేక ప్రచారం వైసీపీకి అవసరమయినప్పుడల్లా చేస్తుందనే ఆరోపణలున్నాయి. కానీ, టీవీ 5 మాత్రం అలా లేదు. పూర్తిగా మారిపోయింది. అయితే, టీవీ 5 అలా ఎందుకు మారిందనేది అటు వైసీపీ పెద్దలకు కాని ఇటు టీవీ యాజమాన్యానికి మాత్రమే తెలుసు.
Also Read: Secretariat employees: ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సచివాలయ ఉద్యోగులు