KCR alcohol habit : కేసీఆర్ కు మద్యం ఇలా అలవాటైందట.! వైరల్ వీడియో

KCR alcohol habit : తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆది నుంచి మంచి మద్యం ప్రియుడు అన్న పేరుంది. రాత్రయితే చాలు రెండు పెగ్గులు వేసుకొని కమ్మగా పడుకుంటారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయితే తనకు మద్యం తాగే అలవాటు ఉందన్న విషయాన్ని కేసీఆర్ ఎప్పుడూ దాచుకోలేదు. దాన్ని బయటపెడుతూనే ఉంటాడు.అందుకే తెలంగాణలో మద్యంకు కాస్త వెసులుబాట్లు ఎక్కువగానే ఉంటాయన్న గుసగుసలు వినిపిస్తుంటాయి. కేసీఆర్ పుట్టిపెరిగిన సిద్దిపేటలో వారిది దొరల కుటుంబం. చాలా మంది అక్కలు,సోదరులతో నిండుగా […]

Written By: NARESH, Updated On : June 15, 2022 3:22 pm
Follow us on

KCR alcohol habit : తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆది నుంచి మంచి మద్యం ప్రియుడు అన్న పేరుంది. రాత్రయితే చాలు రెండు పెగ్గులు వేసుకొని కమ్మగా పడుకుంటారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయితే తనకు మద్యం తాగే అలవాటు ఉందన్న విషయాన్ని కేసీఆర్ ఎప్పుడూ దాచుకోలేదు. దాన్ని బయటపెడుతూనే ఉంటాడు.అందుకే తెలంగాణలో మద్యంకు కాస్త వెసులుబాట్లు ఎక్కువగానే ఉంటాయన్న గుసగుసలు వినిపిస్తుంటాయి.

కేసీఆర్ పుట్టిపెరిగిన సిద్దిపేటలో వారిది దొరల కుటుంబం. చాలా మంది అక్కలు,సోదరులతో నిండుగా ఉండేది. ఏ చిన్న పండుగ అయినా ఘనంగా జరిగేది. తెలంగాణ సంప్రదాయంలో కల్లు, మద్యం తాగడం అనేది చిన్నప్పటి నుంచే మొదలుపెడుతారు. పిల్లలకు, పెద్దలకు,ఆఖరుకు మహిళలకు కూడా ఈ కల్లును పోస్తుంటారు.

ఇక కొందరు 60 ఏళ్లు దాటిన మహిళలు మద్యం కూడా సేవించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా ఓసారి ఒప్పుకున్నాడు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో గతంలో కేసీఆర్ మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అయ్యింది.కేసీఆర్ కు తాగుడు అలవాటు ఎలా స్ట్రాట్ అయ్యిందనేది అందులో వివరించారు. ‘‘తనకు ఐదేళ్ల వయసున్నప్పుడే చిన్నగా మద్యం అలవాటు చేశారని.. డిగ్రీలో ఉండగా ఒక గ్లాస్ బీర్ తాగేవాడినని.. ఢిల్లీలో పీజీ చదివే రోజుల్లో చలికి తట్టుకోలే రోజూ రాత్రి తాగేవాడినని కేసీఆర్ చెప్పుకొచ్చారు.’’

మాది దొరల కుటుంబం అని.. మద్యం తాగనని దాచుకోవడానికి ఏమీ లేదని.. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ప్రజల్లోకి వెళ్లి వచ్చి సాయంత్రం రెండు పెగ్గులు వేసి అలసట మరిచిపోయి పడుకొని తెల్లవారి ఫ్రెష్ గా వెళ్లి ప్రచారం చేసుకునే వాళ్లమంటూ కేసీఆర్ తన మద్యం అలవాటు ఎలా అయ్యిందో పూసగుచ్చినట్టు వివరించారు.

తన భార్య తరుఫు వాళ్లకు మద్యం అలవాటు లేదని.. ఆమె తనను తాగుడు మాన్పించాలని చూసినా.. తన ఇంట్లో ఆడవాళ్లు కూడా తాగడం చూసి ఇక గమ్మునుందని కేసీఆర్ వివరించారు. ఇలా మద్యం అనేది కేసీఆర్ కుటుంబంలో భాగమని.. స్నేహితుల ప్రోత్సాహంతో డిగ్రీలో అలవాటైన ఈ మద్యప్రవాహం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు.