https://oktelugu.com/

Congress: కాంగ్రెస్ ను ఎవరో ఓడించరు.. వాళ్లకు వాళ్లే ఓడిస్తారు!

Congress: కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలు.. ఆదిపత్యపు పోరులు.. అసలు నాయకుడినే ధిక్కరించేంతటి స్వాతంత్య్రం ఆ పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ అధ్యక్షులను సీనియర్లు ధిక్కరిస్తారు.. అస్సలు ఫాలో కారు.. అక్కడ రాహుల్ గాంధీకైనా? ఇక్కడ రేవంత్ రెడ్డికి అయినా ఇదే గతి. రాహుల్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్లు అసమ్మతి రాజేస్తే.. తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియామకమైన రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి వాళ్లు వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ లో ఉంటూనే ఆ పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తుతారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 20, 2022 / 04:17 PM IST
    Follow us on

    Congress: కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలు.. ఆదిపత్యపు పోరులు.. అసలు నాయకుడినే ధిక్కరించేంతటి స్వాతంత్య్రం ఆ పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ అధ్యక్షులను సీనియర్లు ధిక్కరిస్తారు.. అస్సలు ఫాలో కారు.. అక్కడ రాహుల్ గాంధీకైనా? ఇక్కడ రేవంత్ రెడ్డికి అయినా ఇదే గతి.

    రాహుల్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్లు అసమ్మతి రాజేస్తే.. తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియామకమైన రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి వాళ్లు వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ లో ఉంటూనే ఆ పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తుతారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలను సహించలేక కాంగ్రెస్ సీనియర్లు అసమ్మతి రాజేశారు.

    ఈ క్రమంలోనే రేవంత్ ను వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. మరోవైపు శశిధర్ రెడ్డి , వీహెచ్ లాంటి సీనియర్లు హైదరాబాద్ హోటల్ లో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలుతుందా? అన్న సందేహాలు వెలువడుతున్నాయి.

    ఈ క్రమంలోనే తనను సస్పెండ్ చేస్తారన్న వార్తలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి బరెస్ట్ అయ్యారు. తమకు పార్టీ షోకాజ్ నోటీస్ ఇస్తే సమాధానం చెబుతానని.. సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

    ఒక వేళ తననే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తే రోజుకొకరి బండారం బయటపెడుతానని జగ్గారెడ్డి సంచలన హెచ్చరికలు చేశారు. హైదరాబాద్ లోని హోటల్ లో కాంగ్రెస్ సీనియర్ల ప్రత్యేక భేటి అనంతరం జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

    రేవంత్ రెడ్డికి నేరుగా సవాల్ చేశారు. నా స్థానంలో కాంగ్రెస్ మరో అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటే రేవంత్ రెడ్డియే హీరో అని ఒప్పుకుంటానని తొడగొట్టారు. పార్టీ సిద్ధాంతంలో రేవంత్ పనిచేయడం లేదని.. వీహెచ్ తన కూతురు సమస్యపై హరీష్ రావును కలిస్తే తప్పేంటి? అని జగ్గారెడ్డి నిలదీశారు.

    ఇలా కాంగ్రెస్ లోని కుమ్ములాటలు ఇప్పుడు బయటపడ్డాయి. సీనియర్లు అంతా ఏకమై హోటల్ లో సమావేశం పెట్టి రేవంత్ పై అసమ్మతి రాజేశారు. ఆ మంటలు కాంగ్రెస్ లో అంటుకొని పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసే అవకాశాలున్నాయి. తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత వేళ దాన్ని క్యాష్ చేసుకునే బదులు కాంగ్రెస్ లో ఈ కుమ్ములాటలతో పార్టీ పరువును నేతలు బజారుకీడుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ను ఎవరో ఓడించాల్సిన పని లేదని..కాంగ్రెస్ నేతలే ఓడిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి.