Iran Allows Indian Ships Hormuz Strait: ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. వాటర్మైన్స్ అమర్చింది. దీంతో 25 రోజులుగా హర్మూజ్ వద్ద వందల చమురు, సురుకు రవాణా నౌకలు నిలిచిపోయాయి. అయితే భారత ప్రభుత్వం ఇరాన్‌తో జరిపిన చర్చలతో భారత నౌకలు హర్మూజ్ దాటుతున్నాయి. ఇప్పటికే 8 నౌకలు భారత్‌కు చేరుకున్నాయి. తాజాగా ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు మినహా అన్నింటికీ అనుమతి ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, భారత్‌తో పాటు చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్లా ఉన్న మిత్ర దేశాల నౌకలు హర్మూజ్ జలాంతర్గతాన్ని దాటుతూ ప్రయాణించేందుకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఈమేరకు ’ఎక్స్’లో పోస్టు చేశారు.
భారత్‌పై ప్రభావం
హర్మూజ్‌లో చిక్కుకున్న భారత నౌకలు, ముఖ్యంగా ఐదు గ్యాస్ ట్యాంకర్లు రెండు మూడు రోజుల్ల భారత్‌కు చేరుకోనున్నాయి. ఇది భారత వాణిజ్యానికి ఊతం ఇవ్వనున్నాయి. గ్యాస్ కొరత తీరనుంది. ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న దేశాల నౌకలకు మాత్రం అనుమతి ఇవ్వమని స్పష్టం చేసింది.
టోల్ విధానం
హర్మూజ్ డ్రాక్లో ప్రయాణించే నౌకలపై ఫీజు వసూలు చేసే చట్టాన్ని ఇరాన్ పార్లమెంట్ ఆమోదించే దశలో ఉంది. బదులుగా భద్రతా సంరక్షణ అందిస్తామని అధికారిక ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ ఈ అంశాన్ని హైలైట్ చేసింది. ఫీజు వసూలు చేస్తే ఆయిల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ ఆర్థిక అవసరాల కోసం ఫీజు ఆలోచన చేస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాలు మాత్రం దీనిని అంగీకరించవు.
నౌకల అనుమతి మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య శాంతి సంకేతంగా కనిపిస్తుంది. భారత్‌లాంటి దేశాలకు ప్రయోజనం చేకూరినా, టోల్ విధానం గ్లోబల్ షిప్పింగ్ ఖర్చులను పెంచే అవకాశం ఉంది. ఇది ఇరాన్ ఆర్థిక బలోపేతానికి దోహదపడుతుంది.