Dhurandhar 2 First Week Worldwide Collections: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) మేనియా ఏ రేంజ్ లో కొనసాగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో సరికొత్త మైల్ స్టోన్ ని దాటుతూ, కినివినీ ఎరుగని గ్రాస్ వసూళ్లను రాబడుతూ , ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఈ చిత్రం ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో దశాబ్దాల నుండి చెక్కు చెదరకుండా ఉన్న రికార్డ్స్ ని, ఈ చిత్రం కేవలం మొదటి వారం లోనే తుడిచిపెట్టేసింది. నార్త్ అమెరికా లో 8 సంవత్సరాల నుండి చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ‘బాహుబలి 2’ ఫుల్ రికార్డు ని ఈ వీకెండ్ తోనే దాటేయబోతుంది. వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు వివరంగా చూడబోతున్నాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి వారం లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 940 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొదటి వారం లోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబడుతుందని అంతా అనుకున్నారు కానీ, ఆ అంచనాలు తప్పాయి. మరో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే , ఈ సినిమా ‘పుష్ప 2’ మొదటి వారం గ్రాస్ వసూళ్లను కూడా అందుకోలేకపోయింది. ‘పుష్ప 2’ చిత్రానికి మొదటి వారం లో వరల్డ్ వైడ్ గా 965 కోట్ల రూపాయిలు వచ్చాయి. అంటే ‘ధురంధర్ 2’ చిత్రం పాతిక కోట్లు ‘పుష్ప 2’ కంటే తక్కువ రాబట్టింది అన్నమాట. కానీ ఫుల్ రన్ లో మాత్రం ‘పుష్ప 2’ ని ఈ చిత్రం అవలీలగా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లను ఒక కేసు స్టడీ గా తీసుకోవచ్చు.
బాలీవుడ్ కి బడా మార్కెట్ అయినటువంటి మిడిల్ ఈస్ట్ లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. అయినప్పటికీ కూడా ఓవర్సీస్ లో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. నిన్న కూడా ఈ చిత్రం ఓవర్సీస్ నుండి రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రీమియర్ షోస్ + మొదటి రోజు నుండి ఈ చిత్రానికి 5.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజున 4.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత మూడవ రోజున 6.2 మిలియన్ డాలర్లు, నాల్గవ రోజున 6 మిలియన్ డాలర్లు, 5 వ రోజున 2 మిలియన్ డాలర్లు, 6 వ రోజున 2.2 మిలియన్ డాలర్లు, 7 వ రోజున 2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఓవరాల్ గా మొదటి వారం లో ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 268 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఈ వీకెండ్ తో 300 కోట్ల మార్కుని కూడా దాటనుంది ఈ చిత్రం.