Jinnah Tower In Guntur: ఏపీలోని ‘జిన్నా టవర్’ చరిత్ర తెలుసా?

Jinnah Tower In Guntur: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో ఉన్న ‘జిన్నా టవర్’ ఇటీవల వార్తల్లో నిలిచింది. బీజేపీ పోరుబాటతో జిన్నా టవర్ వివాదాస్పదమైంది. దేశ విభజనకు కారణమై పాకిస్తాన్ ఏర్పాటు చేసుకొని ఆ దేశ జాతిపిత అయిన ‘జిన్నా’ పేరు మీద గుంటూరులో ఈ టవర్ ఉండడాన్ని బీజేపీ వ్యతిరేకించి ఆందోళన పట్టింది. జిన్నా టవర్ స్తూపం పేరు మార్చాలని..లేదా అసలు స్తూపాన్ని తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ […]

Written By: NARESH, Updated On : February 10, 2022 10:23 am
Follow us on

Jinnah Tower In Guntur: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో ఉన్న ‘జిన్నా టవర్’ ఇటీవల వార్తల్లో నిలిచింది. బీజేపీ పోరుబాటతో జిన్నా టవర్ వివాదాస్పదమైంది. దేశ విభజనకు కారణమై పాకిస్తాన్ ఏర్పాటు చేసుకొని ఆ దేశ జాతిపిత అయిన ‘జిన్నా’ పేరు మీద గుంటూరులో ఈ టవర్ ఉండడాన్ని బీజేపీ వ్యతిరేకించి ఆందోళన పట్టింది. జిన్నా టవర్ స్తూపం పేరు మార్చాలని..లేదా అసలు స్తూపాన్ని తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జాతిపితగా పిలవబడే ‘మహ్మద్ అలీ జిన్నా’ పేరు మీదుగా ఏర్పాటు చేసిన ఈ స్తూపం ఇక్కడ ఎందుకు ఉంది? దాని వెనుక చరిత్ర ఏమిటి? రాజకీయంగా కాకరేపుతున్న ఈ జిన్నా టవర్ ఏర్పాటు వెనుకున్న చరిత్రపై స్పెషల్ ఫోకస్..

బ్రిటీష్ హయాంలో స్వాతంత్య్రానికి పూర్వం భారత్-పాకిస్తాన్ లు కలిసే ఉండేవి. అప్పట్లో బ్రిటీష్ పాలనలో అఖండ భారతవాని పాలించబడేది. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీతోపాటు మహమ్మద్ అలీ జిన్నా లాంటి ముస్లిం నాయకులు కూడా పాల్గొన్నారు. క్విట్ ఇండియా పోరాటంలో భాగంగా పోరాటం ఉధృతంగా సాగుతున్న రోజులు అవీ. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకూ లక్షల మంది బ్రిటీష్ వారితో పోరాడుతున్నారు.

ఈ క్రమంలోనే క్విట్ ఇండియా పోరాటంలో భాగంగా పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయంలో 1942లో గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న లాల్ జాన్ భాషా.. అప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు మహమ్మద్ అలీ జిన్నాతో గుంటూరులో భారీ సభ నిర్వహించాలని తలంచారు. ఈ క్రమంలోనే ముంబై వెళ్లి జిన్నాను ఆహ్వానించారు.

సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో జిన్నా సభకు హాజరుకాలేదు. జిన్నా స్థానంలో ఆయన సన్నిహితుడు జుదా లియాఖత్ అలీఖాన్ ఈ సభకు వచ్చారు. అయితే జిన్నా వస్తున్నారని.. ఆయన చేతుల మీదుగా స్మారక స్తూపాన్ని ఆవిష్కరించాలని లాల్ జాన్ భాషా ఒక స్తూపాన్ని కట్టించారు. కానీ జిన్నా రాకపోవడంతో సభకు వచ్చిన అప్పటి స్వాతంత్ర్య సమరయోధులు ఈ స్తూపాన్ని ఆవిష్కరించి వెళ్లిపోయారు. ఆనాటి నుంచి జిన్నా కోసం రెడీ చేసిన ఈ స్తూపాన్ని గుంటూరు నగరంలో ‘జిన్నా టవర్’ గా పిలవడం ప్రారంభించారు. అదే గుంటూరులో ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది.

అయితే ఇదే జిన్నా భారత్ నుంచి వేరుపడి పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేసుకొని రెండు దేశాల మధ్య ఎంతటి అగాధాన్ని.. హింసను ప్రేరేపించేలా చేశాడో అర్థం చేసుకోవచ్చు. జిన్నా భారత్ ను, హిందువులను ఎంత ద్వేషించాడో.. పాకిస్తాన్ లో హిందువులపై ఎన్ని దాడులు జరిగాయో చూశాం.. జిన్నాను అందుకే బీజేపీ వ్యతిరేకిస్తూ ఆయన పేరుతో భారత్ లోని గుంటూరులో ఉన్న ఈ టవర్ ను వ్యతిరేకిస్తున్నారు.

గుంటూరులోని ప్రధాన రహదారిపై ఉన్న ఈ టవర్ సమీపంలో ఉన్న ఈ టవర్ చుట్టూ ఎన్నో వ్యాపార సముదాయాలు ఉన్నాయి. స్వాతంత్య్రం పూర్వం నుంచి ఇక్కడ అన్ని మతాలవారు స్నేహపూర్వకంగా ఉంటున్నారు. ఇప్పటివరకూ ఎలాంటి ద్వేషాలు లేని ఈ టవర్ వద్ద ఇప్పుడు నేతల రాజకీయంతో నిలువునా చీలిన పరిస్థితులున్నాయి. కొందరు టవర్ ను వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు దీనికి అనుకూలంగా గళం విప్పుతున్నారు. మరి ఈ జిన్నా టవర్ వివాదం ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.