BJP vs KCR: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అందివచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇప్పటికే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతూ ప్రజల్లోకి వెళ్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకు గాను దిశానిర్దేశాలు చేస్తోంది. పార్టీ నేతలు అందరు అందుబాటులో ఉండాలని సంకేతాలిస్తోంది. సమావేశాలను విజయవంతం చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకు గాను పార్టీ పలు సూచనలు చేస్తోంది. నేతలు సమర్థవంతంగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అభిప్రాయపడుతోంది. సమావేశాలకు ప్రధానమంత్రి మోడీతో పాటు నలభై మంది మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. దీంతో బీజేపీ ప్రతిష్ట మరింత పెరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు దక్షిణాదిలో నిర్వహించడం అరుదే. అలాంటి ఖ్యాతి మన హైదరాబాద్ కు రానుంది. దీంతో ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చూస్తోంది. నేతలంతా కష్టపడి కనీసం ఐదు లక్షల మంది జనసమీకరణ చేసేలా చూడాలని చెబుతోంది. పార్టీ బలోపేతానికి ఇదో చక్కని అవకాశంగా సూచిస్తోంది. నేతలంతా జనసమీకరణపైనే దృష్టి సారించి సమావేశాలను విజయవంతం చేసి ప్రజల్లో పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రధాని రోడ్ షోకు అనుమతి కోరినా ఒకవేళ వీలు కాకపోతే బహిరంగ సభను దిగ్విజయం చేసేలా చూడాల్సిందిగా కోరుతోంది.
Also Read: CM KCR- Telangana Formation Day: ఓవైపు డబ్బుల కటకట.. మరోవైపు కేసీఆర్ పొగడ్తల వర్షం
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. ఇందు కోసమే అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. పార్టీని విస్తరించేలా ప్రణాళికలు రచిస్తోంది. దీనికి గాను నాయకత్వం సైతం శ్రద్ధ తీసుకుంటోంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరికి బాధ్యతలు అప్పగిస్తోంది. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే క్రమంలో అన్ని స్థాయిల్లో నేతలు చురుగ్గా కదలాలని అభిప్రాయపడుతోంది. టీఆర్ఎస్ ను గద్దె దించి బీజేపీ జెండా ఎగరేలా చూడాలని ఇప్పటికే సూచనలు చేసింది. కేసీఆర్ ను ఎదుర్కొనే క్రమంలో బీజేపీ నేతలు అలసత్వం వహించకూడదు. కుటుంబ పాలన అంతమొందించి బీజేపీ పాలన రాష్ట్రంలో కొనసాగేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు ఇంకా కిలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వర్సెస్ బీజేపీ అనే ధోరణిలో ప్రస్తుతం రాజకీయాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సద్వినియోగం చేసుకుని పార్టీని జనంలోకి తీసుకెల్లేందుకే నిర్ణయించుకుంది. కేంద్ర పథకాలను రాష్ర్ట పథకాలుగా చెప్పుకునే సీఎం కేసీఆర్ ఇంకెంత కాలం పబ్బం గడుపుకుంటారో అని ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కార్యకర్త నుంచి నేతల వరకు అందరు ప్రజా క్షేత్రంలోనే ఉంటూ పార్టీ చేపడుతున్న పథకాలను ప్రజలకు విడమర్చి చెప్పాలని చెబుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ ను ఎదుర్కొని సమరంలో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. దీనికి జాతీయ కార్యవర్గ సమావేశాలను సావకాశంగా తీసుకుంటోంది. బీజేపీ కల నెరవేరుతుందా? వేచి చూడాల్సిందే మరి.
కేసీఆర్ మూడో కూటమి అంటూ జాతీయ రాజకీయాల్లో రాణిస్తానని కంకణం కట్టుకుని తిరుగుతున్నారు. ఆయన ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతోనే కేసీఆర్ పై ఫైట్ చేసేందుకు బీజేపీ కూడా అంతే స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. దీనికి నేతలను సమాయత్తం చేస్తోంది. అన్ని మార్గా్లో కేసీఆర్ విధానాలు ఎండగట్టి ప్రజల్లో పట్టు సాధించాలని బీజీపీ యోచిస్తోంది.