Hijab Controversy: కర్ణాటక హైకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. హిజాబ్ వ్యవహారంపై అనుకున్నదే అయింది. కొద్ది రోజుల కింద సంచలనం సృష్టించిన హిజాబ్ వ్యవహారంలో రెండు వర్గాల్లో ఆందోళన నెలకొంది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించకూడదనే నిబంధనను సవాలు చేస్తూ ఒక వర్గం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన కోర్టు మతపరమైన అంశాలు విద్యాసంస్థల్లో తగదని సూచించింది. హిజాబ్ ధరించాలనే నిబంధన సరైనది కాదని తేల్చింది. దీంతో హిజాబ్ ధరించొద్దనే విషయం చెప్పింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రముఖుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ఉద్రిక్తలు తలెత్తకుండా అప్రమత్తమయ్యారు. వీఐపీల భద్రత రెట్టింపు చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ర్టంలో శాంతిభద్రతల సమస్య రాకుండా చూసుకున్నారు. హిజాబ్ వ్యవహారంలో జరిగిన గొడవల గురించి మనకు తెలిసిందే.
Also Read: బీజేపీ వర్సెస్ స్పీకర్: హైకోర్టు చెప్పినా ‘తగ్గేదేలే’ అంటున్న పోచారం
రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. ముఖ్య పట్టణాల్లో గస్తీ ముమ్మరం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శాంతిభద్రతల సమస్యపై హోం మంత్రితో చర్చించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో రాష్ర్టంలోని కబురగి, దావణగెరె, బెల్గాం, కొప్పల్, గడగ్, హాసన్ జిల్లాల్లో నిషేధం విధించారు. శాంతిభద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకున్నారు. తీర్పు వెలువరించడానికి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

మతపరమైన అంశం కావడంతో రెండు వర్గాల్లో ఉద్రిత్తలు తలెత్తకుండా చూసుకున్నారు. హిజాబ్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించొద్దని చెప్పడంతో అందరిలో ఆశ్చర్యం నెలకొంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో జడ్జిల ఇళ్ల వద్ద కూడా భద్రత పెంచారు. అల్లర్లు చెలరేగకుండా జాగ్రత్తలు చేపట్టింది. దీంతో రాష్ర్టంలో గొడవలకు తావు లేకుండా చర్యలు ముమ్మరం చేసింది.
Also Read: అరగంటలోనే కోమటిరెడ్డికి ప్రధాని అపాయింట్ మెంట్.. ఏం జరుగుతోంది..?
[…] […]