జగన్ సర్కార్ కు మరోసారి హైకోర్టు షాక్

ఏపీ సీఎం జగన్ కు మరోసారి హైకోర్టులో షాక్ తగిలింది. టీడీపీ ఆధీనంలోని సంగం డెయిరీని ఆక్రమించేయడానికి ఇచ్చిన జీవో చెల్లదని తీర్పునిచ్చింది. వరుసగా జగన్ నిర్ణయాలకు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగలడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ గా కొనసాగుతున్న సంగం డెయిరీని ప్రభుత్వం టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లు దీన్ని నిర్వహించిన […]

Written By: NARESH, Updated On : May 7, 2021 1:44 pm
Follow us on

ఏపీ సీఎం జగన్ కు మరోసారి హైకోర్టులో షాక్ తగిలింది. టీడీపీ ఆధీనంలోని సంగం డెయిరీని ఆక్రమించేయడానికి ఇచ్చిన జీవో చెల్లదని తీర్పునిచ్చింది. వరుసగా జగన్ నిర్ణయాలకు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగలడం హాట్ టాపిక్ గా మారింది.

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ గా కొనసాగుతున్న సంగం డెయిరీని ప్రభుత్వం టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లు దీన్ని నిర్వహించిన ధూళిపాళ్ల నరేంద్ర, ఇతర డైరెక్టర్లకు డెయిరీపై హక్కులు కోల్పోయినట్టు అయ్యింది.

సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఆ సంస్థ డైరెక్టర్లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుందని పిటీషనర్ల తరుఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

దీంతో సంగం డెయిరీ వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను ఉన్నత న్యాయస్థానం నిలుపుదల చేసింది. సంగం డెయిరీ సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని.. డెయిరీ స్థిర, చరాస్తులను అమ్మాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ప్రభుత్వం ఎంత వాదించినా సరే హైకోర్టు ఒప్పుకోలేదు. సంగం డెయిరీ రోజువారి విధులు మాత్రమే అధికారులకు అప్పగించామని.. ఏసీబీ కేసులో సంగం డెయిరీ చైర్మన్, ఎండీ తదితరులు అరెస్ట్ అయినందున విధులు నిర్వహించేందుకు మాత్రమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రభుత్వం వాదనను కోర్టు అంగీకరించలేదు.