School Fee: ప్రైవేట్ విద్యాసంస్థలకు ఊరట.. ఫీజుల రేట్లపై ప్రభుత్వానికి హైకోర్టు షాక్..

School Fee: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ధరలకు సంబంధించిన జీవో 53, 54 జీవోను హైకోర్టు కొట్టివేసింది. చట్టానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ జీవోలను ఇచ్చారని కోర్టు తెలిపింది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారని కోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం తరుపున న్యాయవాదులు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ఈ జీవోల్లోని అంశాలను మార్చి కొత్త జీవోలను జారీ చేయాలని ఆదేశాలు చేసింది. ఎయిడెడ్, […]

Written By: NARESH, Updated On : December 27, 2021 4:47 pm
Follow us on

School Fee: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ధరలకు సంబంధించిన జీవో 53, 54 జీవోను హైకోర్టు కొట్టివేసింది. చట్టానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ జీవోలను ఇచ్చారని కోర్టు తెలిపింది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారని కోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం తరుపున న్యాయవాదులు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ఈ జీవోల్లోని అంశాలను మార్చి కొత్త జీవోలను జారీ చేయాలని ఆదేశాలు చేసింది. ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజు ఖరారుపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై సవాల్ చేస్తూ తూర్పుగోదావరికి చెందిన విద్యాసంస్థల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు యాజమాన్యాల ప్రతిపాదనలను తీసుకొని వారికి అనుగుణంగా ఫీజులు మార్చాలని తెలిపింది.

movie ticket prices

ఏపీ ప్రభుత్వం గత ఆగస్టులో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఏడాదికి రూ.10 నుంచి 18 వేలకు మించి ఫీజులు వసూలు చేయకూడదని నిర్ణయిస్తూ జీవో 53,54 ను జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం ట్యూషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్, లాబోరేటరీ, స్పోర్ట్స్, కంప్యూటర్ లాబోరేటరీ, స్టూడెంట్ వెల్ఫేర్, స్టడీ టూర్ ఇలా అన్నీ కలిపి అందులోనే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను ఏడాదిలో మూడు వాయిదా పద్ధతుల్లో వసూలు చేయాలని తెలిపింది.

అయితే ఈ ఫీజులు తమకు గిట్టుబాటు కావని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన చేశాయి. కనీస సౌకర్యాలు కూడా లేని పాఠశాలల్లోనూ ఇలాంటి ఫీజులు వర్కౌట్ కాదని అన్నారు. విద్యావ్యవస్థ మెరుగుపడాలని ఇంటర్నేషనల్ లెవల్లో అన్ని హంగులతో పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, ఇలాంటప్పుడు విద్యాసంస్థలకు పెట్టుబడులు అవసరముంటాయన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యాసంస్థలు నడవలేవని, ఇలాంటి ఫీజులు నిర్ణయిస్తే కొన్ని విద్యాసంస్థలు మూతపడే అవకాశముందని అన్నారు. టీచర్లకు జీతాలు ఇవ్వాలంటే విద్యార్థుల నుంచి వచ్చిన ఆదాయమే దిక్కని కొందరు అన్నారు. ఈమేరకు కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యాసంస్థల యాజమన్యాలు వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. ప్రతి ప్రైవేట్ స్కూల్, జూనియర్ కాలేజీల అభిప్రాయాలు తీసుకున్నాకే ఫీజులు ఖరారు చేయాలని తెలిపింది. ఈమేరకు కొత్త జీవోలను జారీ చేయాలని సూచించింది. జీవో 53,54 ప్రకారం ఫీజులతో విద్యాసంస్థలు నడవలేవని, వాటి నిర్వహణ, బోధన ఖర్చులతో సాధ్యం కాదని తెలిపింది.

గత రెండేళ్లుగా కరోనాతో కొట్టుమిట్టాడుతున్న విద్యాసంస్థలకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 53,54తో మరింత నష్టం కలిగింది. దీంతో కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే మూత పడ్డాయి. అయితే హైకోర్టు తీర్పుతో వారిలో ఆశలు రేకెత్తాయి. కాగా కొందరు యామజమాన్యాలు సినిమా టికెట్ల రేట్ల మాదిరిగానే ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను ప్రభుత్వం నియంత్రించిందని, కానీ విద్యావ్యవస్థ తప్పని సరిఅయినందున ఫీజులు భారీగా తగ్గింపుతో ముందుకు వెళ్లలేవని అభిప్రాయపడుతున్నారు.