Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu : లక్కీడ్రాలోనూ వసూళ్లే.. జనసేన దెబ్బకు మంత్రి అంబటిపై మరో కేసు

Ambati Rambabu : లక్కీడ్రాలోనూ వసూళ్లే.. జనసేన దెబ్బకు మంత్రి అంబటిపై మరో కేసు

Ambati Rambabu : ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ మన ఏపీ మంత్రివర్యులు అంబటి రాంబాబు బాగోతాన్ని ఆయన నియోజకవర్గమైన సత్తెనపల్లిలోనే బయటపెట్టారు. ఓ బిడ్డను ప్రమాదంలో కోల్పోయిన తల్లికి వచ్చిన పరిహారంలో సగం డిమాండ్ చేశారని స్వయంగా బాధితులే బయటకు వచ్చి అంబటి దోపిడీ వ్యవహారాన్ని కళ్లకు కట్టారు. ఆ వివాదం సమసిపోకముందే మరోసారి కక్కుర్తి పడి అడ్డంగా కేసుల పాలయ్యారు మంత్రి అంబటి.

సత్తెనపల్లిలో వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో చట్టవిరుద్ధమైన స్కీమ్ ను ఇటీవల ప్రారంభించారు. వాలంటీర్లను వాడుకొని ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందే వారితో బలవంతంగా ఈ టికెట్లు అమ్మించారట.. డబ్బులు వసూలు చేశారట.. ఈ స్కీమ్ పూర్తిగా మంత్రి అంబటి రాంబాబు కనుసన్నల్లో జరిగినట్టు సమాచారం.

జనవరి 12వ తేదీన డ్రా నిర్వహించి విజేతలకు డైమండ్ నక్లెస్, రెండు కార్లు, ఒక ట్రాక్టర్, నాలుగు బుల్లెట్లు, ఆరు మోటార్ సైకిళ్లు, 13 ఎల్.ఈడీలు, 75 మిక్సీలు అందిస్తామని ప్రకటించారు. ఒక్కో కూపర్ ధరను రూ.100గా నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయిలో రూ.కోటి లక్కీ డ్రా ద్వారా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట..

ఈ మేరకు మంత్రి అంబటి రాంబాబు వాలంటీర్లు, వైసీపీ క్యాడర్ కు పుస్తకాలు అందించారు. ఎవరి స్థాయిలో వారు తమ కింది వారిని బెదిరించి కూపన్లు అంటకట్టారు. దీంతో జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా మంత్రి అంబటిపై కేసు నమోదుకు వెనుకాడారు.

దీంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టు పిల్ దాఖలు చేశారు. గాదె వెంకటేశ్వరరావు పిల్ ను మంగళవారం జిల్లా కోర్టును విచారించారు. మంత్రి రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు అంతా వైసీపీ కనుసన్నల్లో ఉంటారు కాబట్టి.. కోర్టు ఆదేశించిందని కేసు నమోదు చేస్తారు కానీ విచారణ జరిగే అవకాశాలు మాత్రం లేవు.

ఇలా వైసీపీ మంత్రులు ప్రజలపై పడి లక్కీ డ్రాలు ఇతర పేరుతో దోపిడీ మొదలుపెట్టారని.. బలవంతపు వసూళ్లతో కోట్లకు పడగలెత్తుతున్నారని తెలుస్తోంది. వీటిని అరికట్టే నాథుడే లేకుండా పోతున్నారు. జనసైనికులు దీనిపై పోరుబాటు పడుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version