Justice Chandru: మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి.. ‘జైభీమ్’ ఫేం జస్టిస్ కే చంద్రు ఇటీవల ఏపీ హైకోర్టుపై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఏపీ ప్రభుత్వంతో హైకోర్టు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ హైకోర్టు తన పరిమితులను దాటి నడుస్తోందంటూ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికైన ప్రభుత్వం తన మనుగడ కోసం రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా న్యాయవ్యవస్థతో పోరాడుతోందని అన్నారు. అమరావతిలో భూకుంభకోణంపై విచారణలో ఇద్దరు న్యాయమూర్తుల ప్రమేయం.. సోషల్ మీడియా పోస్టులపై ఉన్న కేసులను కూడా ఆయన ప్రస్తావించారు.
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను వైసీపీ నేతలు, మీడియా హైలెట్ చేసింది. ఈ వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. రెండు రోజుల తర్వాత జస్టిస్ చంద్రూ వ్యాఖ్యలపై హైకోర్టు నుంచి స్పందన వచ్చింది.
జస్టిస్ చంద్రు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కాన్ఫరెన్స్ అంశానికే పరిమితం చేసి ఉండాల్సిందని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. లైమ్ లైట్ లో ఉండటానికి కొంతమంది న్యాయ ప్రముఖులు హైకోర్టుపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఏపీ హైకోర్టుపై జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై మరో న్యాయమూర్తి జస్టిస్ బి.దేవనాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చేసి ముందు హైకోర్టు నుంచి సమాచారం సేకరించి ఉండాల్సిందని ఆయన అన్నారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడు.. ఆసక్తికరంగా కౌంటింగ్..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి అరెస్ట్ చేసి జైలుకెళ్లి మరణించిన అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ సుధాకర్ మానవ హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ చంద్రూ విశాఖపట్నం వెళ్లి పోరాడాలి ఉండాల్సిందని జస్టిస్ దేవానంద్ అభిప్రాయపడ్డారు.
అయితే ఈ న్యాయమూర్తులు ప్రతిస్పందించడానికి ముందు చాలా మంది టీడీపీ మద్దతుదారులు జస్టిస్ చంద్రుని వ్యాఖ్యలకు ట్రోల్ చేయడం ప్రారంబించారు. ఇది వైసీపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఆడిపోసుకుంటున్నారు . ప్రస్తుతం జస్టిస్ చంద్రు ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: కేసీఆర్, స్టాలిన్.. పాత దోస్తీ పునరుద్ధరణ సాధ్యమేనా?